తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తమ హీరో గురించి చెప్పిన ఈ మాటలను పవన్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో బాగా షేర్ చేస్తున్నారు.
రాజకీయ రంగంలోనూ, సినీ పరిశ్రమలోనూ శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరు అని అంటుంటారు. నిజమే మరి.. ఎప్పుడు ఎవరితో ఎలా ఏ అవసరమొస్తుందో చెప్పలేం కాబట్టి అందరితోనూ మంచిగా ఉండడమే ఉత్తమం. సినిమా వాళ్లకి రాజకీయ నాయకులకు మధ్య మంచి స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. బాలయ్య, మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వేణు తొట్టెంపూడి కొందరు స్టార్లకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. వారి ఇంట్లో, బంధువుల్లో పొలిటీషియన్స్ ఉన్నారు. అలాగే పలు సినిమా కార్యక్రమాలకు రాజకీయ నాయకులు, పలు రాజకీయ కార్యక్రమాలకు తారలు తరలి వెళ్లడం అనేది జరుగుతుంటుంది. సినిమాలు, రాజకీయాలకు అవినాభావ సంబంధం అనేది ఇప్పటిది కాదు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తమ హీరో గురించి చెప్పిన ఈ మాటలను పవన్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో బాగా షేర్ చేస్తున్నారు.
కేటీఆర్, పవన్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ నాకు మంచి ఫ్రెండ్. ఒక అన్న లాంటి వాడు. మేం చాలాసార్లు కలుసుకున్నాం. పలు విషయాలు మాట్లాడుకున్నాం. చాలా విషయాల్లో మా అభిరుచులు కలుస్తాయి. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టం. నాకు కూడా కొంచెం ఇష్టం. అయితే రాజకీయాలకు, స్నేహానికీ సంబంధం లేదు. ఎవరి రాజకీయాలు వారివి. ఆయన రాజకీయాలు ఆయనవి, నా రాజకీయాలు నావి’ అన్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్తూ.. జగనన్న మంచి ఫ్రెండ్ అన్నారు. ఇక ఏపీలో నారా లోకేష్ కూడా తనకు బాగా తెలుసని, తనకు అందరూ స్నేహితులేనని, ఎవరితోనూ ఇబ్బందులు లేవని అన్నారు కేటీఆర్. గతంలో పలు సినిమా ఫంక్షన్లకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్, రామ్ చరణ్ – బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు.
ఇక పవర్ స్టార్ సినిమాల విషయానికొస్తే.. తన మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ టీజర్ కోసం ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజర్‌కి డబ్బింగ్ చెప్పారు పవన్. కేవలం 22 రోజుల్లోనే తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసేశారాయన. ఇందుకుగానూ రోజుకి రూ. 2 కోట్ల చొప్పున పారితోషికం అందుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ సంస్థ నిర్మిస్తుండగా.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 28న ‘బ్రో’ విడుదల కానుంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే హిస్టారికల్ ఫిలిం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. హరీష్ శంకర్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే స్టార్ట్ అయింది. ‘సాహో’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో నటిస్తున్న ‘ఓజీ’ మూవీ అప్పుడే 50 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది.