ఫిల్మ్ డెస్క్- తాత గోప్ప సినీ నిర్మాత.. నాన్న కూడా పెద్ద ప్రొడ్యూసర్.. బాబాయ్ ఇండస్ట్రీలో పెద్ద నటుడు.. ఇక అన్న పరిశ్రమలో స్టార్ హీరో.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అతను మాత్రం హీరో అవ్వలేకపోతున్నాడు. అందేంటీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లెంతమందో సినీ పరిశ్రమలో రాణిస్తుంటే.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరో అవ్వలేకపోతోంది ఎవరనుకుంటున్నారా.. అవును మీరు ఊహించింది నిజమే. దగ్గుబాటి వారి వారసుడు అభిరామ్ ను సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. చాలా రోజులుగా తెలుగు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని దగ్గుబాటి అభిరామ్ ప్రయత్నిస్తున్నాడు. అందుకు అనుగునంగానే ప్రముఖ డైరెక్టర్ తేజ ను ఒప్పించి ఆయన దర్శకత్వంలో తన కొడుకును హీరో చెయ్యాలని నిర్ణయించాడు నిర్మాత సురేష్ బాబు.
ఈమేరకు డైరెక్టర్ తేజ అభిరామ్ తో సినిమా తీసేందుకు కధను రెడీ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అభిరామ్ సరసన నటించేందుకు హీరోయిన్లు ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవలే ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ ను అందుకున్న కృతి శెట్టిని సంప్రదించారట తేజ. ఐతే అభిరామ్ పక్కన నటించేందుకు కృతి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. తనకు వేరే ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పి తెలివిగా తప్పించుకుందట కృతి శెట్టి. దీంతో మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను సంప్రదించినా వాళ్లు కూడా అభిరామ్ సరసన నటించేందుకు పెద్దగా ఇష్టపడలేదని సమాచారం.
దీంతో ఇక లాభం లేదని కొత్త అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసే పనిలో పడ్డారట డైరెక్టర్ తేజ. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న దగ్గుబాటి అభిరామ్ సరసన నటించేందుకు హీరోయిన్లు ఎందుకు ఆసక్తి చూపడం లేదనే కదా మీ సందేహం. ఇందుకు కారణం శ్రీరెడ్డి అని చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే గతంలో తనను అభిరామ్ శారీరకంగా వాడుకుని వదిలేశాడని శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించింది. అంతే కాదు తనకు న్యాయం చేయాలని ఏకంగా హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ముందు అర్దనగ్న ప్రదర్శనతో ధర్నా చేసి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి. దీంతో ఇండస్ట్రీలో దగ్గుబాటి అభిరామ్ కారెక్టర్ కాస్త బ్యాడ్ అయ్యింది.
దీనికి ఆయన పక్కన హీరోయిన్ గా చెయ్యకపోవడానికి సంబంధం ఏంటని మీకు సందేహం కలగవచ్చు. అభిరామ్ తో తేజ తీసే సినిమా కధలో శ్రీరెడ్డికి సంబందించిన అంశం కూడా ఉందని స్వయంగా ఆయనే చెప్పారు. దీంతో ఇటువంటి కాంట్రవర్సీ కధతో తీస్తున్న సినిమాలో నటించి.. మనం కాంట్రవర్సీ కావడం ఎందుకని కృతీ శెట్టీ సహా మిగతా హీరోయిన్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అభిరామ్ సరనస నటించేందుకు హీరోయిన్లు నో చెబుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక చేసేది లేక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసేందుకు డైరెక్టర్ తేజ రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.