తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున వారసుడిగా జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగ చైతన్య. మొదటి చిత్రం పెద్దగా అలరించకపోయినా.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేసావే’మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. హిట్టు.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు నాగచైతన్య. ఇటీవల నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం బంగార్రాజు మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్యం 22 వ చిత్రం ‘కస్టడీ’ టైటిల్ ఖరారు అయ్యింది. చైతూ పుట్టిన రోజు సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘కస్టడీ’ మూవీకి శ్రీనివాస చిట్టూరి దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో నాగ చైతన్య పోలీస్ అధికారి శివ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇక నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.
చైతూ సహ నటి కృతి శెట్టి.. ‘ప్రపంచంలో మార్పు చూడాలనుకుంటే.. ముందు అది నీతోనే మొదలవ్వాలి.. అనే సూక్తికి మీరే సరైన ఉదాహారణ, నా జీవింతో కలిసిన గొప్ప వ్యక్తి మీరు.. మీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.. కస్టడీ పోస్టర్ చాలా గంభీరంగా కనిపిస్తుంది.. పుట్టిను రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు వరుసగా అపజయం పొందాయి. ఈ క్రమంలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి ‘బంగార్రాజు’ మూవీతో మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు.
You must be the change you wish to see in the world! And @chay_akkineni garu is the perfect example! Happy birthday to one of the most humble,sweet and inspiring people I’ve ever met 🌸
looking absolutely fierce in the #firstlook poster from #custody 🔥 pic.twitter.com/NVzNrnCfoh— KrithiShetty (@IamKrithiShetty) November 23, 2022