చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్స్ కి సంబంధించి గాసిప్స్ రావడం మామూలే. ఇద్దరూ ఒకే సినిమాలో జంటగా నటించినా, సోషల్ మీడియాలో ఫోటోలు కనిపించినా, జంటగా స్టేజ్ పై ప్రత్యక్షమైనా.. హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇంకాస్త చనువుగా లేదా దగ్గరగా ఉంటూ మాట్లాడుకున్నా.. కెమిస్ట్రీ బాగుందని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ఆఖరికి లవ్ అంటూ సందేహాలు మొదలైపోతాయి. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ కృతిసనన్ కి మధ్య రిలేషన్ పై ఇలాంటి కథనాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. అదీగాక తోడేలు సినిమా ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్, కృతిలపై హీరో వరుణ్ ధావన్ సందేహాలు రేపాడు.
ఇక ఎలాగో హీరోనే క్లారిటీ ఇచ్చాడు కదా అని.. ప్రభాస్ కి, కృతిసనన్ కి ముడివేసి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే.. ఈ రూమర్స్ పై స్పందిస్తూ, ఆదిపురుష్ సినిమా గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది కృతి. ఆమె మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా కోసం చాలా ఎక్సయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ అయినా ఎంతో సాధారణంగా ఉంటారు. అలాంటివారిని నేను బాలీవుడ్ లో చూడలేదు. ఇంకా ప్రభాస్ మర్యాదలు, ఇంటి భోజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్పింది.
కృతిసనన్ ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్ కి, నాకు మధ్య డేటింగ్ అంటూ వినిపిస్తున్నవన్నీ పుకార్లు. మా మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది. పైగా ఈ గాసిప్స్ ఎలా వచ్చాయో కూడా తెలీదు. ఆదిపురుష్ షూటింగ్ లోనే నాకు ప్రభాస్ మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే.. మా గురించి గాసిప్స్ రావడానికి కారణం ఏమై ఉంటుందో చెప్పాలా.. షూటింగ్ సెట్ లో మేమిద్దరం ఒకరికి ఒకరం భాషలు నేర్పించుకున్నాం. నాకు ప్రభాస్ తెలుగు నేర్పిస్తే, నేను ప్రభాస్ కి హిందీ నేర్పించాను. దీంతో మేమిద్దరం ఎప్పుడు చనువుగా ఉండటం చూసి అపార్థం చేసుకున్నట్లున్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అని రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. మరి ఆదిపురుష్ లో ప్రభాస్, కృతి సీతారాములుగా నటించారు. వీరి జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Adipurush costars 😍😍#Prabhas𓃵 #Kritisanon 💚💚 pic.twitter.com/uk4ARIU7EO
— SANGEETHA (@mithun_dharmik) December 12, 2022