Krithi Shetty: తెలుగులో మొదటి సినిమా ‘ఉప్పెన’తో కుర్రకారు గుండెల్లో ఉప్పెన సృష్టించింది కృతి శెట్టి. అందంతో, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ‘ఉప్పెన’ సినిమా తర్వాత ఆమె నటించిన ‘శ్యాం సింగరాయ్, బంగార్రాజు’ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కృతి శెట్టి తాజా చిత్రం ‘‘ది వారియర్’’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా చేశారామె. తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో భాషల్లో బైలింగువల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కృతి శెట్టి తమిళ నాట చిత్ర ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఆమెపై ప్రాంక్ చేయటంతో బోరున ఏడ్చేశారు.
తాజాగా, బిహైండ్‌వుడ్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యారామె. ఈ అవార్డు ఫంక్షన్ మొదలవ్వటానికి ముందు నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమెను ప్రముఖ ప్రాంక్‌స్టర్లు ఆషిక్, సారథిరన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలోనే కృతి శెట్టిని ప్రశ్నలు అడగటానికి గొడవపడ్డట్టు నటించారు. ఒకానొక దశలో సారథిరన్, ఆషిక్‌పై చెయ్యి చేసుకున్నాడు. కృతి శెట్టి వీరి మధ్య ఏం జరుగుతోందో అర్థంకాక భయపడిపోయి చూస్తూ ఉంది. ఆషిక్‌పై చెయ్యి చేసుకోవటంతో మరింత ఆందోళనకు గురైంది.
ఆమె ఆందోళన పడుతోందని గుర్తించిన వారు అది ప్రాంక్ అని చెప్పేశారు. అయితే, ఆమె సర్‌ప్రైజ్ అవ్వటంతో పాటు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఎందుకు ఏడ్చారని వాళ్లు అడగ్గా.. ‘‘ ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు. అందుకే..’’ అంటూ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. కృతి శెట్టి మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. యాంకర్ల తీరుపై మండిపడుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hrithik Roshan: KGF-3లో హృతిక్ రోషన్.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్!