త్రిషకు సాధారణ ప్రజల్లోనే కాదు.. సినీ సెలెబ్రిటీలలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. త్రిష యాక్టింగ్‌తో ఫిదా అయిపోయి.. చాలా ఏళ్లుగా ఆమెనే తమ అభిమాన తారగా ఆరాధిస్తూ వస్తున్నారు.
సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ దశాబ్ధానికి పైగా ఏలిన అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో త్రిష ఒకరు. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. త్రిష 1999లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి ఈమెకు సాధారణ ప్రజలే కాదు.. సెలెబ్రిటీలలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సెలెబ్రిటీ ఫ్యాన్స్‌లో కృతి శెట్టి ఒకరు. ఈ విషయాన్ని స్వయంగా కృతి శెట్టే మీడియాకు వెల్లడించారు.
ఓ సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు త్రిష అంటే చాలా ఇష్టం. ఆమె ముఖంలో గ్లో ఏమీ తగ్గలేదు. ఆమె ఇప్పటికీ నాకంటే అందంగా కనిపిస్తున్నారు. అని నేను అనుకుంటున్నాను’’ అని అన్నారు. ఇక, కృతి శెట్టి నటించిన ‘కస్టడీ’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటించారు. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు.
కాగా, కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఉప్పెన తర్వాత వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్‌గా నిలిచాయి. దీంతో ఆమె ఖాతాలోకి హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాతి నుంచి ఆమె సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోతున్నాయి. వరుస అపజయాలు ఆమెను వెంటాడుతున్నాయి. మరి, త్రిష అందంపై కృతి శెట్టి కామెంట్లు చేయటంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
#KrithiShetty picks #Trisha as her favorite actress…
“I’ve been crushing on #Trisha maam a lot. She is looking younger than me.”
Yet one more celebrity who is a fan of South Queen @trishtrashers 🔥 @IamKrithiShetty
#PS2 #Leo #AK62pic.twitter.com/TgjKIMaqNn— Lets OTT (@LetsOTTOff) May 12, 2023