కరోనా సెకండ్ వేవ్ భారత్‌ని భయపెడుతోంది. ఫస్ట్ వేవ్‌లో పాజిటివ్ కేసులు వచ్చినా.. మరణాల రేటు చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు రేటు కూడా అధికంగా ఉంది. అలాగే ఆక్సిజన్ సమస్య కూడా ప్రజలను, ప్రభుత్వాలను కలవరపెడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనాని లైట్ తీసుకుంటే.. చాలా తీవ్ర పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది నటి కృతికర్బందా.
”నేను, నా కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డాం. కరోనా మన వరకు వస్తే గానీ తెలియడం లేదు.. అది ఎంత ప్రమాదకరమైన వైరస్ అనేది. దాదాపు 48 గంటల పాటు మా ఫ్యామిలీ అంతా నరకం చూశాం. నిజంగా అత్యంత దారుణమైన పరిస్థితులను ఫేస్ చేశాం. అందుకే చెబుతున్నాను.. సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి అవసరం అయితే తప్ప అస్సలు బయటికి వెళ్లవద్దు. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..” అని కృతికర్బందా విజ్ఞప్తి చేసింది.