పాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో డార్లింగ్ ప్రభాస్ ఒకరనే సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రభాస్ నుండి పెళ్లి వార్త వినాలని ఫ్యాన్స్ అంతా ఉత్సాహం కనబరుస్తున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా డార్లింగ్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. పెళ్లి మాట ప్రస్తావించిన ప్రతిసారి దాటవేస్తూ వచ్చాడు. అయితే.. తాజాగా ప్రభాస్ పెళ్లి పై ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి స్పందించారు.
ప్రభాస్ పేరు వినగానే చాలామందికి బాహుబలి సినిమా గుర్తొస్తుంది. బాహుబలి అనగానే అనుష్క శెట్టి కూడా ఆలోచనలో ప్రత్యక్షమవుతుంది. ఆ వెనకే ప్రభాస్ – అనుష్క పెళ్లి అంటూ ఊహించేసుకుంటారు ఫ్యాన్స్. కానీ అదంతా సినిమాల వరకే.. ఉత్తుత్తి పెళ్లి. అయితే.. ప్రభాస్, అనుష్క మంచి ఫ్రెండ్స్ అనే మాట మాత్రం వాస్తవం. వారిద్దరూ కూడా ఇదివరకే పెళ్లి వార్తలన్నీ ట్రాష్ అని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఈ మధ్య కూడా ప్రభాస్ – అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా మాధ్యమాలలో రూమర్లు గుప్పుమంటున్నాయి. ఈ విషయం పై తాజాగా స్పందించిన శ్యామలాదేవి.. ప్రభాస్ – అనుష్క పెళ్లి వార్తలను ఖండించారు. ప్రభాస్ కి మన సాంప్రదాయాలు, కుటుంబం, పెద్దలు, మహిళలపై చాలా గౌరవం ఉందని.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పెళ్లి తప్పకుండా చేసుకుంటాడని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం శ్యామలాదేవి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రభాస్ పెళ్లి విషయం పక్కన పెడితే.. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు ‘రాధేశ్యామ్‘ మూవీ రెడీ అవుతోంది. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమాను రాధాకృష్ణకుమార్ తెరకెక్కించాడు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ గా కనిపించనున్నాడు. మరి ప్రభాస్ పెళ్లి, రాధేశ్యామ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.