తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు కృష్ణం రాజు. ‘చిలుక గోరింక’చిత్రంతో నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. కెరీర్ బిగినింగ్ లో నెగిటీవ్ పాత్రల్లో నటించినా.. తర్వాత రెబల్ స్టార్ గా మంచి పేరు సంపాదించారు. అయితే కృష్ణంరాజు.. చివరగా అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’లో గణపతి దేవుడిగా కనిపించి అలరించారు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా తన మార్క్ చాటుకున్నారు కృష్ణం రాజు. ఇండస్ట్రీలో కృష్ణం రాజు నట వారసుడిగా ఆయన సోదరుడి తనయుడు ప్రభాస్ హీరోగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో బిల్లా, రెబల్ మూవీస్ వచ్చాయి. కృష్ణం రాజు ఇండస్ట్రీలో మర్యాదకు కేరాఫ్ అడ్రస్ అంటారు. తాజాగా కృష్ణం రాజు తన ఇంట్లో పనిమనిషికి ఖరీదైన బహుబతి ఇచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. గత 25 ఏళ్లుగా తన ఇంట్లో పని మనిషిగా పద్మ అనే మహిళ పని చేస్తుంది.
ఈ క్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు.. ‘25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్’ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ఆమెకు గోల్డ్ చైన్ బహుమతిగా అందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఫొటోలను ప్రభాస్ సోదరి ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి వైరల్‌గా మారాయి. పనిమనిషి అంటే ఇంత గౌరవం ఇచ్చి ఆమెకు ఖరీదైన బహుబతి ఇవ్వడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కృష్ణంరాజు దంపతులపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.