కృష్ణ వంశీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరియచయం అక్కర్లేని పేరు ఇది. అనేక విభిన్నమైన సినిమాలను తెరకెక్కించింది క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందరు. గులాబీ,సింధూరం, ఖడ్గం, అంతఃపురం.. వంటి సినిమాలతో ప్రేక్షకల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఒకప్పడు టాలీవుడ్ లోని టాప్ దర్శకుడిగా కొనసాగాడు. 2017లో నక్షత్రం సినిమాను డైరెక్ట్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత రంగమార్తాండ సినిమాను వంశీ తెరకెక్కించారు. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంది.. రంగమార్తాండ మూవీ టీమ్. ఈ క్రమంలో కృష్ణ వంశీ పలు ఇంటర్వ్యూలో పాల్గొన్ని.. సినిమా గురించి, తన ఫ్యామిలీ సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. తన కెరీర్, రమ్యకృష్ణతో ఉన్న ఫ్యామిలీ రిలేషన్ గురించి వంశీ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ” రమ్యకృష్ణ రేంజ్ ఫుల్ ఫామ్ లో ఉన్న నటి. ఆమెను అందుకోవాలనే టెన్షన్ ఉంటుంది. నాకు రమ్యతో పోటీ ఉండేది. అయితే గత నాలుగైదు ఏళ్లుగా నేను కాస్త స్లో అయినట్టున్నాను. అయితే అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య ఏర్పడే గ్యాప్ వలన మా బంధం బలపడుతోంది. నేను హైదరాబాద్ లో, రమ్య చెన్నైలో ఉంటుంది. ఆమెకు ఖాళీ దొరికినప్పుడు ఇక్కడి వస్తుంది. నాకు వీళ్లు దొరికినప్పుడు చెన్నై వెళ్తాను. మా అబ్బాయి రిత్విక్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. వాడికి ఎప్పుడు ఏం అవ్వాలో వాడే డిసైట్ చేసుకుంటుంటాడు. ఒక వారం క్రికెట్ అంటాడు.
ఇంకో వారం బిజినెస్ అంటాడు. ఇంకో వారం క్రిప్టో కరెన్సీ అంటాడు. అందులోనూ మద్రాసులో పెరిగాడు కదా. రిత్విక్ ప్రస్తుతం టీనేజ్ కదా.. అందుకే పేరెంట్స్ నుంచి కాస్త దూరంగా ఉంటాడు. కాకపోతే అప్పుడప్పుడూ వాళ్లమ్మతో షూటింగ్స్ కి వెళ్తుంటాడు. అయితే రమ్య రిత్వీక్ మీద 24 గంటలు ఓ కన్నేసి ఉంటుంది. రమ్య అక్కడ, మీరిక్కడా ఉంటే చాలా పుకార్లు వస్తుంటాయి. అయితే వాటికి మేమే రియాక్ట్ కావడం లేదు. ఎవరేం కంగారు పడొద్దు, బాధపడొద్దు. నేనూ, రమ్య కలిసే ఉన్నాం. ఇలాంటి గాసిప్స్ ఎంతో మంది మీద కనిపిస్తూనే ఉంటాయి.అయితే మా కొడుకు మాత్రం రియాక్ట్ అవుతుంటాడు” అని అన్నారు. మరి..కృష్ణ వంశీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.