ప్రముఖ సీనియర్ నటులు, రెబల్ స్టార్ కృష్ణం రాజు తుది శ్వాస విడిచారు. ఆజానుబాహుడిగా ఉండేవారు కృష్ణం రాజు.. ఇండస్ట్రీలో బాహుబలిలా అనిపిస్తారు. గతంలో కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ వాటిని ఆయనేమీ లెక్కచేయలేదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు. 83 ఏళ్ల వయసులో కూడా ఆయన చురుగ్గా కనిపించేవారు. అలాంటి ఆయన ఇంత త్వరగా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారని ఎవరూ ఊహించలేదు. ఆయన శరీరాన్ని విడిచి చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ యావత్తు తెలుగు ప్రేక్షకులు, రెబల్ స్టార్ అభిమానులు, యంగ్ రెబల్ స్టార్ అభిమానులు హృదయాల్లో మాత్రం రారాజులా నిత్యం వెలిగిపోతుంటారు.
కృష్ణం రాజు మృతితో సినీ పరిశ్రమతో పాటు ఆయన అభిమాన లోకం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణం రాజు మరణ వార్తని అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రభాస్ కి కృష్ణం రాజు అంటే చాలా ఇష్టం. కృష్ణం రాజుకి కూడా ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం. ప్రభాస్.. కృష్ణంరాజు సోదరుడు సూర్య నారాయణ రాజు కొడుకు అయినప్పటికీ సొంత తండ్రిలా చూసుకున్నారు. ప్రభాస్ కి తండ్రి లేని లోటుని కృష్ణం రాజు భర్తీ చేశారు. అయితే కృష్ణం రాజు లేని లోటుని ఎవరూ భర్తీ చేయలేనిది.
అయితే కృష్ణం రాజు చివరి కోరిక తీరకుండానే ఆయన స్వర్గానికి పయనమయ్యారు. కృష్ణం రాజు చివరి కోరిక ఒకటి ఉండిపోయింది. అది ప్రభాస్ పెళ్లే. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని, కళ్లారా ఆ పండగని ఆస్వాదించాలని, ఆ కన్నుల పండుగని స్వయంగా అనుభూతి చెందాలని అనుకున్నారు. ప్రభాస్ పెళ్లి విషయంలో ఆయన ఎన్నో సార్లు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి చూడాలని ఉందని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ప్రభాస్ కోసం అమ్మాయిని వెతుకుతున్నామని, త్వరలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన అప్ డేట్ ఉంటుందని అనేవారు.
ప్రభాస్ పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని, వారితో కూడా కలిసి నటించాలని కోరిక ఉందని, ఖచ్చితంగా నటిస్తానని ధీమాగా చెప్పారు. అలాంటి కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లి చూడకుండానే తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. ప్రభాస్ ని ఏక్ నిరంజన్ ని చేసి వెళ్లిపోయారు. చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానం అంటారు. కాబట్టి ఆయన అంతా పై నుండి చూస్తూనే ఉంటారు. ప్రభాస్ పెళ్లి కూడా ఆయనే విధి ద్వారా జరిపిస్తారని నమ్ముదాం. ఆయనకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని కోరుకుంటుంది సుమన్ టీవీ. ఓం శాంతి!.
ఇది చదవండి : Breaking: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత! కారణం?