కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన వాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. రెగ్యులర్ గా మూవీస్ లో చూసే నటీనటుల్ని అయితే కొన్నిసార్లు గుర్తుపట్టడమే కష్టమవుతుంది. సడన్ గా ఓ డిఫరెంట్ లుక్ లో వాళ్లని చూసి షాక్ అవుతాం. ఇంకా చెప్పాలంటే సైలెంట్ అయిపోతాం. ఇప్పుడు కూడా ప్రముఖ హాస్యనటి షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇక ఆమెని చూసిన తెలుగు ప్రేక్షకులు.. గుర్తుపట్టడానికే చాలా టైం తీసుకుంటున్నారు. మరి మీరైనా సరే ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోవై సరళ అంటే ఇప్పుడు జనరేషన్ కు తెలియకపోవచ్చు గానీ ఓ 15-20 ఏళ్ల ముందు వచ్చిన తెలుగు సినిమాలు చూసుకుంటే మాత్రం చాలా సినిమాల్లో కనిపించింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు జోడీగా కనిపించి ఫుల్ ఎంటర్ టైన్ చేసేది. చివరగా రవితేజ ‘కిక్ 2’లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత మన సినిమాల్లో నటించడం దాదాపు తగ్గించేసింది. అవకాశాలు రాకపోవడం కూడా దీనికి కారణం కావొచ్చు. అలా అని నటిగా నటిగా అయితే ఏం ఖాళీగా లేదు. పలు తమిళ సినిమాల్లో యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ చేస్తూనే వస్తుంది.
ప్రస్తుతం ఆమె మెయిన్ రోల్ లో చేస్తున్న తమిళ సినిమా ‘సెంబి’. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అందులో కోవై సరళ లుక్స్ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఎన్నో పాత్రలతో ఎంతో అద్భుతంగా కామెడీ పండించిన ఆమె.. ఇప్పుడు ఇందులో సీరియల్ రోల్ చేస్తున్నారు. దానికోసం తన లుక్ నే కంప్లీట్ గా మార్చేసుకున్నట్లు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా.. బడుగు బలహీన వర్గాలని రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎలా ఉపయోగించుకున్నారు అనే కాన్సెప్ట్ పై తీసినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా సరే తన పాత్ర కోసం ఇప్పటికీ కష్టపడుతూ, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోవై సరళని చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు. ఆమె డెడికేషన్ కి ఫిదా అయిపోతున్నారు. మరి కోవై సరళని ఈ లుక్ లో చూసినా సరే ఎంతమంది గుర్తుపట్టారు? దిగువన కామెంట్ చేయండి.