టాలీవుడ్ లో కోట శ్రీనివాస్ రావు విలక్షణ నటుడిగా ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటిస్తూ నటన పరంగా మంచి మార్కులనే కొల్లగొట్టి అనేక అవార్డులు సైతం అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కోట శ్రీనివాస్ రావు అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ముక్కుసూటిగా సమాధానాలు చెబుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన Jr.NTR పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇది కూడా చదవండి: KGF – Marvel Universe: బిగ్ బ్రేకింగ్.. ‘మార్వెల్ యూనివర్స్’లా KGF సిరీస్! క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
టాలీవుడ్ మంచి నటుడిగా విమర్శకుల నుంచి సైతం Jr.NTR ప్రశసంలు అందుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన RRR సినిమాల్లోని కొమురం భీముడో సాంగ్ లో NTR నటనపై ప్రముఖ హీరోలు సైతం తమ దైనశైలీలో స్పందించారు. ఇక ఇంతటి నటనను కనబరిచిన Jr.NTRకు నేషనల్ అవార్డు కూడా వస్తుందంటూ కొందరు నటులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోట శ్రీనివాస్ రావు కూడా Jr.NTRపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు నచ్చిన హీరో Jr.NTR అని కోట శ్రీనివాస్ తెలిపారు. అతనికున్న పొటెన్షియాలిటీ టాలీవుడ్ లో మరెవరికీ లేదని ఆయన అభిప్రాయాపడ్డాడు. తన డైలాగ్ డెలవరీ , డ్యాన్సులు, నటన ఇలా అన్నిట్లోనూ Jr.NTR తన మార్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని కోట శ్రీనివాస రావు అన్నారు. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారాయి. Jr.NTR పై కోటశ్రీనివాస్ రావు చేసిన ఈ విధమైన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.