ప్రముఖ కొరియన్ సింగర్ లీ సాంగ్ యున్ శవమై తేలింది. ప్రదర్శనకు కొద్ది నిమిషాల ముందు బాత్‌రూమ్‌లో విగత జీవిలా కనిపించిందామె. గురువారం (జూలై 6) జరిగిన ఈ సంఘటన ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. గురువారం (జూలై 6) ప్రముఖ సింగర్ కోకో లీ మరణించారనే వార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న లీ రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో మరో పాపులర్ సింగర్ కన్నుమూశారనే వార్తతో పరిశ్రమ వర్గాల వారు షాక్‌కి గురయ్యారు. ప్రముఖ కొరియన్ సింగర్ లీ సాంగ్ యున్ శవమై తేలింది. ప్రదర్శనకు కొద్ది నిమిషాల ముందు బాత్‌రూమ్‌లో విగత జీవిలా కనిపించిందామె.
గురువారం (జూలై 6) జరిగిన ఈ సంఘటన ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక కొరియన్ మీడియా కథనం ప్రకారం.. బాత్‌రూమ్‌లో లీ సాంగ్ యున్ మృతదేహాన్ని గుర్తించిన ఈవెంట్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారని తెలుస్తుంది. మరి కొద్ది నిమిషాల్లో లీ సాంగ్ ప్రదర్శన మొదలు కానుంది. ఇంతలోనే ఆమె అనుమానాస్పదంగా మృతి చెందడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. లీ కేసుని ఛాలెంజింగ్‌గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. లీ సాంగ్ యున్ తనదైన ప్రతిభతో సోప్రానో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సియోల్ నేషనల్ యూనివర్శిటీలో చదువుకున్న లీ.. సంగీతంలో అసాధారణమైన ప్రతిభను కనబరిచింది. మ్యూజిక్‌పై తనకున్న ప్యాషన్‌తో న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మకమైన మన్నెస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. లీ సాంగ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలియజేశారు.