Konidela Sreeja: కొణిదెల శ్రీజ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురిగా ఈమె తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. ఇక, శ్రీజ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. శ్రీజ ప్రస్తుతం ఫారెన్‌లో వెకేషన్‌లో ఉన్నారు. అక్కడి అందమైన ప్రాంతాలను చుడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్‌కు సంబంధించిన చిత్రాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె వరల్డ్ గ్రాటిట్యూడ్ డే పై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ మంచి, చెడు సమయాల్లో నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను కోపంగా ఉన్నప్పుడు నా కోపాన్ని భరించారు.
ఏడుస్తున్నపుడు ఓదార్పునిచ్చారు. నేను మాట్లాడుతున్నపుడు శ్రద్ధగా విన్నారు. నాతో ఉంటున్నందుకు కృతజ్ఞతలు. నా మాట వింటున్నందుకు, నా యోగ క్షేమాలు తెలుసుకుంటున్నందుకు, మీ బలమైన మద్దతుకు నా కృతజ్ఞతలు. నా కుటుంబానికి, ఫ్రెండ్స్ లాంటి ఫ్యామిలీకి ఎంతో రుణపడి ఉన్నాను’’ అని పేర్కొన్నారు. పోస్ట్‌తో పాటు వెకేషన్‌లో దిగిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. మరి, వరల్డ్ గ్రాటిట్యూడ్ డే సందర్భంగా కొణిదెల శ్రీజ చేసిన ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Saravana Dhanapal: ప్రముఖ ఆర్టిస్ట్ శరవణ ధన్‌పాల్ ఇకలేరు!