ఇటీవల అనేక మంది ప్రముఖులు క్షణంలో మాయమౌతున్నారు. నిన్న ఉంటున్న మనిషి మరో రోజు లేడని తెలిస్తే బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అలా అనేక మంది నటీనటులు కనుమరుగయ్యారు. తాజాగా కోలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ అనారోగ్య సమస్యలతో చనిపోయారు.
నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అంటూ ఓ సినీ కవి అన్నట్టు.. మరణం క్షణికం అని తెలిసి కూడా కుంచిత మనస్తత్వాలతో బతుకుతుంటాం. పుట్టెడప్పుడు ఏమీ తీసుకు రామని, పోయేటప్పుడు ఏమీ తీసుకు వెళ్లమని తెలిసినా.. ఇగో,కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతుంటాం. సంపాదనే పరమావధిగా మార్చుకుని, బిజీ బిజీ లైఫ్ లో గజిగజిగా గడుపేస్తుంటాం. నూటికి 99 శాతం మంది ఇదే దినచర్య. కొంత మంది మాత్రమే కొంచెం భిన్నంగా ఆలోచిస్తూ.. వినూత్న మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కళా రంగంలో ఉన్న కమెడియన్లు.. వాళ్లు నవ్వుతూ..అందర్ని నవ్విస్తూ ఉంటారు. వెనుక ఎన్ని విషాదాలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా నవ్వు అనే ఆయుధాన్ని వినియోగించి.. కాస్త ప్రజలను తమ టెన్షన్ లైఫ్ ను దూరం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే అదే కమెడియన్ చెడు వ్యసనాలను బానిసై ప్రాణాలు పొగొట్టుకుంటే..
బుల్లితెర ప్రముఖుడు, హాస్యనటుడు, మిమిక్రీ కళాకారుడు కోవై గుణ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన ఏడాదిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన తొలుత విజయ్ చానల్‌లో ప్రసారమైన కలక్క పోవదు యారులో తన మిమిక్రీ, కామెడీతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారు. ఆ తర్వాత అతను సన్ టెలివిజన్ షో అసత పోవదు యారులో మిమిక్రీ చేయగా మంచి పేరొచ్చింది. ముఖ్యంగా శివాజీ గణేషన్, హాస్యనటులు గౌండమణి, జనగరాజ్ మరియు దివంగత తమిళ నటుడు ఎంఆర్ రాధల వాయిస్‌లను ఆయన బాగా అనుకరించేవారు. ఆయన చనిపోయాడన్నఈ వార్త తమిళ కామెడీ అభిమానులకు షాక్ నిచ్చింది. అయితే అతడు చెడు వ్యసనాలకు లోనై అతడి జీవితాన్ని అంతం చేసుకున్నట్లు మరో కమెడియన్ మదన్ బాబు తెలిపారు.