తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఓ బ్లాక్ బస్టర్ చిత్రంతో ఇండస్ర్టీకి పరిచయమైన సంగతి తెలిసిందే. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డికి తమిళ్ లో రీమేక్ గా తీసిన “ఆదిత్య వర్మ”తో ధృవ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో బ్రిటీష్ బ్యూటీ బనిత సంధు హీరోయిన్‌గా నటించింది.
ఇది కూడా చదవండి:
ఆచార్య స్పెషల్ సాంగ్: చిరు స్టెప్పులు, రెజినా అందాలు.. తట్టుకోవడం సానా కష్టం!
గతేడాది అక్టోబర్‌లో “హూవీ” అనే మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటిష్ బ్యూటీ.. ఆ తర్వాత విక్కీ కౌశల్ తో “సర్దార్ ఉద్దమ్”లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే బనిత, ధృవ్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అంతేగాక వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ పలు తమిళ మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ రూమర్లకు బలాన్నిస్తూ ధ్రువ్- బనితాలకు సంబంధించిన ఫొటోలు కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ జంట కలిసి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్ రూం బాల్కానీలో బనిత నిలబడిన ఫొటోను షేర్ చేస్తూ “హ్యాపీ న్యూ ఇయర్” శుభాకాంక్షలు తెలిపాడు ధ్రువ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ధృవ్, బనితలను ఇలా చూసి వారి అభిమానులు.. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరి.. ధృవ్ విక్రమ్, బనితలపై వస్తోన్న డేటింగ్ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.