2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమా విడుదలైంది. ఇదే రోజున అంటే 2023 28న పీఎస్ 2 విడుదలైంది. దీంతో బాహుబలి 2 కన్నా పీఎస్ 2 బాగుందని కొంతమంది అరవ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పడి ఓ తెగ అరుస్తున్నారు. బాహుబలి వరస్ట్ మూవీ అని మొరుగుతున్నారు. మనోళ్లు ఊరుకుంటారా? పొన్నియన్ సెల్వన్ కాదు, పన్నీర్ సెల్వన్ అని కౌంటర్ ఇస్తున్నారు.
ఆరేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆ సినిమా.. ‘తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని అన్ని సినిమాలు లేవురా.. ఉన్నది ఒక్కటే సినిమా, అది ఇండియన్ సినిమా’ అని నిరూపించింది. దక్షిణాది చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి రికార్డులు క్రియేట్ చేయవచ్చు, అప్పటి వరకూ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే జనంతో దక్షిణాది సినిమా కూడా ఇండియన్ సినిమానే అనుకునేలా చేయవచ్చు అని నిరూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలకు ఒక పూల బాట వేసిందని చెప్పవచ్చు. ఆ సినిమానే బాహుబలి.
రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 అనేక రికార్డులను సృష్టించాయి. అలాంటి బాహుబలి సినిమాని పట్టుకుని తమిళ ఫ్యాన్స్ పిచ్చి కూతలు కూస్తున్నారు. బాహుబలి 2 సినిమాని చెత్త సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం సైతం పీఎస్ 1, పీఎస్ 2 సినిమాలకు ప్రేరణ బాహుబలి సినిమా అని చెప్పడం, ఈ సినిమాలు తెరకెక్కించడానికి తనకు ధైర్యాన్నిచ్చిన సినిమా బాహుబలి అని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు బాహుబలి సినిమా ఎంత గొప్పదో. కానీ ఈ విషయం అరవ బ్యాచ్ కి అర్థం కావడం లేదు. బాహుబలి 2 సినిమాని, పీఎస్ 2 సినిమాతో పోలుస్తున్నారు. పీఎస్ 2 సినిమా బాగుందని అన్నా పర్లేదు. కానీ బాహుబలి 2 కంటే వంద రెట్లు బాగుంది అంటేనే తెలుగు సినిమా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
బాహుబలి ఒక చెత్త సినిమా అని, పీఎస్2 చాలా గొప్ప సినిమా అని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాహుబలి ఫ్యాన్స్ మాత్రం తమిళ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. బాహుబలి సినిమాలో ఏదో ఒక సీన్ పీఎస్ 1, పీఎస్ 2 సినిమాల కంటే చాలా బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి 2 తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ కొట్టిందని, ఆ రికార్డుని బ్రేక్ చేయలేకపోతున్నందుకు సాంబార్ బ్యాచ్ బాహుబలి మీద పడి ఏడుస్తున్నారని తెలుగు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది పొన్నియన్ సెల్వన్ కాదని, పన్నీర్ సెల్వన్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి తమిళ ఫ్యాన్స్ బాహుబలి 2 సినిమాని పీఎస్ 2 తో పోల్చడం, బాహుబలి 2 కంటే పీఎస్ 2 వంద రెట్లు బాగుందనడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#PonniyinSelvan2 >>>>> This Sh*t Bahubali 2 🤫🔥 pic.twitter.com/lmzOHlkShs
— ⱽʲ VIPER ♠️ (@VJViper_jd7) April 28, 2023
#PonniyinSelvan2 is 100 TIMES BETTER THAN #Baahubali. 🔥🔥#Maniratnam the master craftsman has done it in style. 🔥🔥 #PS2 pic.twitter.com/CEz3UKtwc4
— Lets OTT (@LetsOTTOff) April 28, 2023
Baahubali 2 comparison enti ra miku bahubali 1 ekuva 😂😂😂🤣#6YearsForIndianIHBaahubali2 #PonniyanSelvan2
Baahubali 1 >> ps 1 &2
Agree or die 😂🤣 pic.twitter.com/YcjESoAbQk— MB_Husband_LOKI🦅🤙 (@LokiPkcult88) April 28, 2023