అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఘన విజయం సాధించింది. పాన్‌ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక‌్షన్లు సాధించింది. ఈ సినిమా ఒక రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలోని పాటలను, డైలాగ్‌లను, బన్నీ మ్యానరిజాన్ని ఇప్పటికే క్రికెటర్లు కూడా రీల్స్ చేస్తు రచ్చ చేస్తున్నారు. తాజా కోల్‌కత్తా పోలీసులు కూడా పుష్ప సినిమా క్రేజ్‌ను వాడుకున్నారు. బన్నీ ఫోటోను తమ అధికారిక ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసిన ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
#Pushpa #RoadSafety #TrafficDiscipline #roadsafetyawareness pic.twitter.com/765trSIaqL
— Kolkata Police (@KolkataPolice) February 1, 2022
ఈ సినిమాలో హీరో చెప్పే ఫేమస్ డైలాగ్ ‘పుష్ప.. పుష్పరాజ్ ఝుకేగా నహీ’ను మార్చి ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు పుష్ప ముందుకు వెళ్లడు అని చెప్తు.. ‘పుష్ప జాయేగా నహీ’ అంటూ అల్లుఅర్జున్ బైక్‌పై ఆగిఉన్న ఫోటోను పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అల్లు అర్జున్ ఫొటోను బెంగాల్ పోలీసులు ఒక మంచి పనికి ఉపయోగించినందుకు బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి పుష్పకు వచ్చిన ఈ భారీ క్రేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.