ఐపీఎల్‌లో సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ పెళ్లి గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. త్వరలోనే అతను తన ప్రేయసి ఆతియా శెట్టిని వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం చివర్లో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోనున్నారు. దీనికి రాహుల్-ఆతియా పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత కేఎల్ రాహుల్ ఒక ఇంటివాడు కానున్నాడు.
కాగా కేఎల్ రాహుల్ పెళ్లాడబోయే ఆతియా శెట్టి మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు. ఆమె నాలుగైదు బాలీవుడ్ సినిమాల్లో నటించింది కూడా. 2015లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది. అనంతరం ముబారకన్, నవాబ్జాదె, మోతీచూర్ ఛక్నాచూర్ మూవీల్లో మెరిసింది. సునీల్ శెట్టిది తుళు ఫ్యామిలీ. మంగళూరు కొప్పళ సమీపంలోని ముల్కీ వారి స్వస్థలం. అనంతరం బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో సునీల్ శెట్టి ముంబైలో స్థిరపడ్డాడు. కేఎల్ రాహుల్ స్వస్థలం కూడా మంగళూరే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చిన్నారి ప్రాణాలు కాపాడిన KL రాహుల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.