మెగాస్టార్ చిరంజీవికి, కిరణ్ అబ్బవరంకి సంబంధం లేదు కదా. మరి చిరంజీవి కామెంట్ తో కిరణ్ అబ్బవరంకు సమస్య ఏమిటి అనే కదా మీ డౌటానుమానం ఆఫ్ ఇండియా. మరేం లేదండి.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన డైలాగ్స్ ని ఎవరైనా సరే ఇమిటేట్ చేయడం గొప్పగా ఫీలవుతుంటారు కదా. చిరు డైలాగ్ కి వేరే వ్యక్తి మొఖం పెట్టి.. ఆ డైలాగ్ ఆ వ్యక్తి చెప్తున్నట్టు సరదాగా చేసినా కూడా గొప్ప అనుభూతిగా ఫీలవుతుంటారు అవునా కాదా? అసలు చిరుతో పోలిస్తేనే గర్వంగా ఫీలవుతారు. అలాంటిది చిరంజీవి ముఖాన్ని మాస్క్ చేసి.. దాని మీద కిరణ్ అబ్బవరం ముఖాన్ని పెట్టి ఎవరో నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మరి చిరంజీవితో తనను పోల్చినందుకు హ్యాపీగా ఫీలవ్వాలి గానీ కిరణ్ అబ్బవరం ఎందుకు హర్టయినట్టు?
వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఒక మాట అన్నారు. రవితేజను, తనను ఉద్దేశించి.. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నది ఇద్దరే ఇద్దరు.. అది మేమే అని అన్నారు. చిరంజీవి, రవితేజ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాం అని అన్నారు. ఈ వీడియోని ఒక నెటిజన్ మార్ఫింగ్ చేశాడు. చిరు ఫేస్ మీద కిరణ్ అబ్బవరం ముఖాన్ని, రవితేజ ఫేస్ మీద ఆది సాయి కుమార్ ముఖాన్ని పెట్టి.. ఆ డైలాగ్స్ ని అలానే ఉంచి ఒక వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేసేది ఇద్దరే ఇద్దరు, ఒకరు కిరణ్ అబ్బవరం, మరొకరు ఆది సాయికుమార్ అని అర్థం వచ్చేలా ఆ వీడియో ఉంది. ఇందులో ఫీలవ్వాల్సిన విషయం ఏముంది అని అనిపించవచ్చు. కిరణ్ ని చిరుతో, ఆదిని రవితేజతోనే కదా పోల్చారు అనిపిస్తుంది.
కానీ ఈ వీడియోలో ఇద్దరినీ అవమానించడం వల్లే.. కిరణ్ అబ్బవరం రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఈ వీడియో కింద దాదాపు అన్నీ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. కిరణ్ అబ్బవరం, ఆది సాయికుమార్ ఈ ఇద్దరూ జనం మీద బలవంతంగా వరుస పెట్టి సినిమాలు వదులుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అదే కిరణ్ అబ్బవరంను బాధపెట్టింది. వీడియోని రీట్వీట్ చేస్తూ.. వీడియో చేసిన వ్యక్తికి కౌంటర్ ఇచ్చారు. ‘మోవా నా మూడేళ్ళ కెరీర్ లో 5 సినిమాలు విడుదలయ్యాయి అని నాకు తెలుసు. నాకు తెలియకుండా నా సినిమాలు ఏమైనా విడుదలై ఉంటే దయచేసి చెప్పండి. నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను బ్రో’ అంటూ కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశారు.
వరుసపెట్టి సినిమాలు నేనెక్కడ చేశాను, జనం మీద నేనెక్కడ రుద్దాను అంటూ కిరణ్ అబ్బవరం ట్వీట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. 2019లో రాజా వారు రాణి గారు, 2021లో ఎస్ఆర్ కళ్యాణ మండపం, 2022లో సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడ్ని.. మొత్తం 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడ్ని సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. మిగతా 3 సినిమాలు హిట్ అయ్యాయి. మరి జనాలు వద్దన్నా సరే బలవంతంగా రుద్దుతున్నారని అనడం ఎందుకు? కిరణ్ ఏమైనా.. అరుళ్ శరవణన్ లా వేల కోట్ల ఆస్తి ఉండి.. జనం యాక్సెప్ట్ చేయకపోయినా, నటన రాకపోయినా బలవంతంగా సినిమాలు తీసి జనాల మీద రుద్దుతున్నారా? లేదు కదా. కిరణ్ అనే వ్యక్తి మంచి నటుడు. కథల విషయంలో మంచి పట్టు ఉంది.
ఏ టాలెంట్ లేకపోతే రాజా వారు రాణి గారు సినిమాకి అన్ని ప్రశంసలు వస్తాయా? ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా? సమ్మతమే సినిమా చూడకుండా ఉండగలిగారా? ట్రోలర్స్ దీనికి సమాధానం చెప్పాలంటూ కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బలవంతంగా జనం మీద రుద్దితే.. చూడ్డానికి జనాలేమీ అమాయకులు కాదని.. నచ్చకపోతే స్టార్ హీరోలనైనా షెడ్డుకి పంపించేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి స్వయంకృషితో ఎదిగి.. ఏదో రెండు సినిమాలు బెడిసికొట్టాయి. అంతమాత్రాన ట్రోల్స్ చేయడం కరెక్ట్ అంటారా? కిరణ్ అబ్బవరం ఆవేదనలో అర్థం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Mowa Na 3 years of career lo 5 films release ayyai ani naku telusu naku teliyakunda na films amaina release ayyunte please cheppandi
Waiting for your answer Bro https://t.co/JP9BOrF0yD
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 9, 2023