Kiraak RP: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. కొన్ని కారణాల వల్ల ఆర్ఫీ.. ఆ షో నుండి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జబర్దస్త్ షో నిర్వాహకులపై, తోటి కమెడియన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలిచారు. తాజాగా షేకింగ్ శేషుపై, ఆయన కుటుంబ సభ్యులపై దారుణ కామెంట్స్ చేశారు.
సినిమా పేరుతో ఒక నిర్మాతని నిండా ముంచేశాడని, ఆర్పీ వల్ల సదరు నిర్మాత రోడ్డున పడ్డాడని ఆర్పీపై షేకింగ్ శేషు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 50 వేలు పెట్టి ఆఫీస్ తీశాడని, అనవసర ఖర్చులతో నిర్మాతని నాశనం చేశాడని శేషు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆర్పీ స్పందించారు. “నిర్మాత మీద శేషుకి అంత ప్రేమే ఉంటే అతని ఇల్లుని ఆఫీస్ గా ఇవ్వాల్సింది. శేషు భార్యను ఆఫీస్ బాయ్ గా చేయమను..శేషుని బాత్రూం లు కడగమని, వాళ్ళ అమ్మాయిని పాల ప్యాకెట్లు తెమ్మని చెప్పు” అంటూ కామెంట్స్ చేశారు.
ఆర్పీ కామెంట్స్ పై నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. షేకింగ్ శేషు మీద కోపం ఉంటే అతనితో తేల్చుకోవాలి గానీ.. ఆయన కుటుంబ సభ్యులని ఇందులోకి ఎందుకు లాగడం అని నెటిజన్లు ఆర్పీని క్వశ్చన్ చేస్తున్నారు. షేకింగ్ శేషు భార్య, కూతురిపై ఆర్పీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.