కిరాక్ ఆర్పీ.. గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసిన తన పేరే వినిపిస్తుంది. అతడికి సంబంధించిన వార్తలే వైరలవుతున్నాయి. జబర్దస్త్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆర్పీ.. తనకంటూ ఓ ప్రత్యేక మ్యానరిజంతో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. బుల్లి తెర మీద సుమారు 400కు పైగా స్కిట్లు చేసి.. ప్రేక్షకులును నవ్వించాడు. ప్రస్తుతం ఆర్పీ నటుడిగా కన్నా కూడా రియల్ ప్రేమికుడిగా గుర్తింపు పొందాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఆర్పీ ఎంత కష్టపడ్డాడో తాజాగా ఓ షోలో స్కిట్ కూడా చేశారు. అది చూసిన వారు.. రియల్ ప్రేమికుడు.. సెలబ్రిటీ అయ్యిండి కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంత కష్టపడ్డడా అని ఆశ్చర్యపోయారు. ఇక ఇదే స్టేజీ మీద ఆర్పీ తన గుండెపై నాగబాబు పేరు పచ్చబొట్టు వేయించుకున్నట్లు ప్రపంచానికి తెలిసింది. దీని వెనక గల కారణాలను ఆర్పీ తాజాగా సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
‘‘లక్ష్మీ ప్రసన్నను చూడగానే నాకు నచ్చింది. ఇష్టపడ్డాను. ఆమెతో పరిచయం పెంచుకోవడం కోసం నంబర్ అడిగితే వాళ్ల అమ్మ నంబర్ ఇచ్చింది. కొన్ని రోజులు వాళ్ల అమ్మతో మాట్లాడాక లక్ష్మీ ప్రసన్నను ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్తే ఆమె నో చెప్పింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమెను ఎలా ఒప్పించాలో.. మా ప్రేమను ఎలా గెలిపించుకోవాలో అర్థం కాక పిచ్చోడిలా తిరుగుతున్నాను. ఇక ఈ విషయం నాగబాబుగారికి తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Kiraak RP: RPతో ప్రేమని ఒప్పుకోవడానికి కారణం చెప్పిన కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న.
‘‘ఓ రోజు ఆయన నాకు కాల్ చేసి ఏరా.. ఏంటి పరిస్థితి అని అడిగారు. నేను ఇలా అయ్యింది సార్ అని చెప్పాను. నా ప్రేమను వాళ్ల అమ్మ ఒప్పుకోవడం లేదని తెలిపాను. అందుకు నాగబాబు గారు.. మరి నేను వచ్చి.. వాళ్లతో మాట్లాడాలా… లేదంటే మన మనుషుల్ని పంపించాలా అని అడిగారు. ఆయన నాకు మద్దతుగా ఉన్నారు చాలు అనుకున్నాను. వద్దు సార్ నేనే ఒప్పిస్తాను అని తెలిపాను. ఒక్క ప్రేమ విషయంలోనే కాక.. నా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇలా ప్రతి సందర్భంలో ఆయన నాకు తోడుగా ఉన్నారు. ఈ రోజు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానంటే ఆయనే కారణం. ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేను. ఆ కృతజ్ఞత, అభిమానంతోనే ఆయన పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను’’ అన్నాడు ఆర్పీ. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. మరి నాగబాబు గురించి కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kirak RP: కాబోయే భార్యతో కిరాక్ ఆర్పీ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!