తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా సమంత హీరోయిన్ గా ‘ఈగ’ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీలో విలన్ గా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించారు. కన్నడ లో స్టార్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. తెలుగులో సుదీప్ కి మంచి మార్కెట్ ఉండటంతో కన్నడలో నటించిన చిత్రాలు తెలుగు లో డబ్ అవుతున్నాయి. ఇటీవల సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ పాన్ ఇండియా మూవీగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా కిచ్చా సుదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న కిచ్చా సుదీప్ కేవలం నటుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రకృతి విపత్తులు సంబవించినపుడు భారీ విరాళాలు ఇస్తూ ఉంటారు. ఎంతో మంది అనాధలను అక్కున చేర్చుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పుణ్యకోటి దత్తు యోజన కింద సుదీప్ ప్రతి జిల్లా నుంచి ఒక్కో ఆవును దత్తత తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల అక్రమరావాణా, పశువధ నుంచి ఆవులను రక్షించడమే లక్ష్యంగా ‘పుణ్యకోటి దత్తు యోజన’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. కర్ణాటక ప్రభుత్వం ఈ పథకానికి హీరో కిచ్చా సుదీప్ ని అంబాసిడర్ నియమించింది.
ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. ఈ మద్య కాలంలో గోవులను అక్రమంగా తరలిస్తూ వధిస్తున్న వార్తలు ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. గోవులను రక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది.. ఈ నేపథ్యంలో పుణ్యకోటి దత్తు యోజన పథకాన్ని తీసుకు రావడం.. దానికి నన్ను అంబాసిడర్ గా నియమించడం నా అదృష్టమే కాదు.. గొప్ప బాధ్యతగా భావిస్తున్నా.. నన్ను నియమించినందుకు సీఎం బసవరాజ్ బొమ్మై, మంత్రి ప్రభు చౌహాన్ కి ధన్యవాదాలు’ తెలిపారు సుదీప్. ఇక తమ అభిమాన హీరో కిచ్చా సుదీప్ గోవులను దత్తత తీసుకోవడం.. అంబాసిడర్ గా ఉండటంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
ಪುಣ್ಯಕೋಟಿ ರಾಯಭಾರಿಯಾಗಲು ಹೆಮ್ಮೆಪಡುತ್ತೇನೆ. ಜಿಲ್ಲೆಗೊಂದು ಗೋವಿನಂತೆ 31 ಗೋವುಗಳನ್ನು ದತ್ತು ಪಡೆಯುತ್ತಿದ್ದೇನೆ. ಈ ಗೌರವ ಮತ್ತು ಅವಕಾಶ ನೀಡಿದ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮತ್ತು ಸಚಿವರಾದ ಪ್ರಭು ಚೌವ್ಹಾಣ್ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.🙏🏼 pic.twitter.com/fBK3mj9euM
— Kichcha Sudeepa (@KicchaSudeep) November 25, 2022