ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈ నెల 7న ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఒక్కొక్కటిగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు ఈ జంట. వాటిలో ఓ ఫోటోలో ధరించిన లెహంగాపై చర్చ నడుస్తోంది.
బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మలోత్రా ఈ నెల 7న పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్ల నుండి ప్రేమలో ఉన్న ఈ జంట అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, ప్రముఖులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి భారీగా ఖర్చు అయినట్లు సమాచారం. ఈ వేడుకలకు మీడియాను ఆహ్వానించలేదు. పెళ్లి తర్వాత ‘పర్మినెంట్ బుకింగ్’అంటూ పెళ్లి ఫోటోను షేర్ చేశారు కియారా. తాజాగా మెహందీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు ఈ జంట.
సంగీత్ వేడుకల్లో సిద్ధార్థ్ తో దిగిన ఫోటోను కియారా అద్వానీ షేర్ చేసుకుంటూ ‘ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్ థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఆమె రాతలపై ఎన్ని వార్తలొచ్చాయో కానీ. ఆమె ధరించిన లెహంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు చర్చంతా దీనిపైనే. బంగారం, వెండిలతో చేసిన ఈ లెహంగాను డిజైన్ చేశారు ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. ఈ లెహంగాకు 98 వేలకు పైగా క్రిస్టల్స్ వినియోగించారట. దీని తయారీ కోసం 4 వేల గంటల సమయం పట్టిందట. అంటే 150 రోజుల పాటు శ్రమించి రూపొందించిందీ మనీష్ మల్హోత్రా టీం. ఈ ధర లక్షల్లో ఉంటుందని సమాచారం.
ఇక అదే సంగీత్ లో సిద్ధార్థ్ ధరించిన బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్ ఫిట్ ను కూడా మనీష్ మల్హోత్రానే రూపొందించారని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఫగ్లీ అనే సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన కియారా.. ధోనీ సినిమాతో పేరొచ్చింది. ‘భరత్ అనే నేను’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బాలీవుడ్ బ్యూటీ. తర్వాత రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామలో సీతగా నటించింది. ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ ఆర్ సి 15లో కూడా ఆడిపాడనుంది. అటు బాలీవుడ్ సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఈ బ్యూటీ సినిమాల్లో మీకేదీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.