సినీ పరిశ్రమలో రెండేళ్లుగా హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతూ అభిమానులకు షాకిస్తున్నారు. అందులోను లాక్ డౌన్ సమయంలో చాలామంది తారలు మూడు ముళ్ళు వేయించుకొని నటనను కూడా కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి చేరేలా కనిపిస్తుందట కుర్రబ్యూటీ కియారా అద్వానీ. ఈ యంగ్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే.. ప్రస్తుతం అమ్మడి పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగవైరల్ అవుతోంది. గతేడాది లాక్ డౌన్ అయినప్పటికి వరుస హిట్లతో కియారా తన క్రేజ్ అమాంతం పెంచుకుంది. సినిమాల్లో గ్లామర్ షోతో పాటు రొమాన్స్ సీన్స్ లో ఎక్కడా రాజీపడట్లేదు. కేవలం సినిమాలతోనే కాదు.. అడపాదడపా అదిరిపోయే ఫోటోషూట్లతో సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. తాజాగా అమ్మడి వాలకం చూస్తుంటే త్వరలోనే ఫాన్స్ కి గుండె పగిలే న్యూస్ చెప్పేలా అనిపిస్తుంది.
ప్రస్తుతం కియారాకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. విషయం ఏంటంటే.. అతిత్వరలో ఈ వయ్యారి వివాహ బంధంలో అడుగుపెట్టనుందట. ఇది రూమర్ అనుకోవచ్చు కానీ కొంతకాలంగా కియారా.. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా చేయి వదలడం లేదట. ఇద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా బయట వీరి కెమిస్ట్రీ చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.అదీగాక వీరిద్దరూ కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నా.. కియారా, సిద్దార్థ్ ఇంతవరకు స్పందించలేదు. అదీగాక ఎప్పుడు చూసినా జంటగా కెమెరా కంట పడుతున్నరు. ఆ మధ్య ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కూడా వెళ్లొచ్చారు. ఇంత జరుగుతున్నా ఇద్దరి మధ్య ఏమి లేదంటే.. నమ్మలేకపోతున్నాం అంటున్నారు నెటిజన్లు. మరి కత్రినా – విక్కీ కౌశల్ లాగే ఈ జంట పక్షులు ఏదొక రోజు తమ రిలేషన్ షిప్ బయట పెడతారని టాక్. చూడాలి మరి వీరి మధ్య నడిచేది నిజమో.. కాదో! కియారా – సిద్దార్థ్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.