తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ భామలలో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ కియారా.. డెబ్యూతోనే తెలుగు కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమా చేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అమ్మడి పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.
ఎందుకంటే వరుస హిట్స్ తో కియారా యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంటుంది. అయితే.. అందరిలాగే డీసెంట్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించిన కియారా.. కొద్దికాలానికే తనలోని బోల్డ్ యాంగిల్ బయటపెట్టింది. గ్లామర్ షోతో పాటు రొమాంటిక్ సీన్స్ లో ఎక్కడా రాజీపడట్లేదు. వాస్తవానికి కియారాకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే అమ్మడు సినిమాలతోనే కాదు హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.
ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ కియారాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇండస్ట్రీలో అందరు హీరోయిన్ల సినిమాలు కరోనా వలన ఆగిపోతే.. కియారా సినిమాలు మాత్రం థియేటర్లతో పాటు ఓటిటిలలో కూడా రిలీజ్ అయ్యాయి. ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సరైన టైం ఇదేనంటూ అమ్మడు బోల్డ్ ప్రకటనలు చేసింది. ఇప్పటికే కబీర్ సింగ్, లస్ట్ స్టోరీస్ లతో పాటు గిల్టీ వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలు చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.
రొమాంటిక్ సీన్స్ లో కియారా నటనకు ఫిదా కానివారు లేరు. ఇక 2014లో “ఫగ్లీ” సినిమాతో కెరీర్ ప్రారంభించిన కియారా.. ఎంఎస్ ధోని, కబీర్ సింగ్, గుడ్ న్యూజ్ లతో పాటు లస్ట్ స్టోరీస్ అనే డిజిటల్ వెబ్ సిరీస్ హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ మూవీ చేస్తోంది. అయితే.. తాజాగా కియారా బ్లాక్ సారీలో దిగిన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ సారీలో అమ్మడు టాప్ టు బాటమ్ అందాలు నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి కియారా సారీ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.