సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా రాణించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ 1980 ది బర్నింగ్ ట్రైన్ చిత్రంతో నటిగా కెరీర్ ఆరంభించిన ఖుష్బు ఆ తర్వాత తమిళ, తెలుగు ఇతర భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బీజేపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.
ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ ఖుష్బు అంటే తెలియని వారు ఉండరు. బాలీవుడ్ లో 1980 లో ది బర్నింగ్ ట్రైన్ మూవీతో కెరీర్ ప్రాంభించిన ఆమె తర్వాత తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరనన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. ఒకప్పుడు తమిళ అభిమానులు ఖుష్బు కి ఏకంగా గుడి కట్టి పూజించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఖుష్బు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా నటి ఖుష్బు తీవ్ర ఆస్వస్థతకు లోనుకావడంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, నీరసరం తో ఖుష్బూ ఇబ్బంది పడటంతో వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను ఖుష్బు స్వయంగా ఇన్ స్ట్రాలో షేర్ చేసింది. ‘ ఫ్లూ చాలా భయంకరమైనది.. ఇది నాపై చాలా ఎఫెక్ట్ చూపించింది.. నాకు ఫ్లూ రావడంతో తీవ్రంగా జ్వరం, ఒంటినొప్పులు, చాలా బలహీనంగా మారండతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.. అడెనో వైరస్ ను ఎవరూ తక్కువగా అంచనా వేయవొద్దు.. ఇది చాలా డేంజర్ వైరస్. ఎవరైనా అనారోగ్యానికి గురై ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అంటూ రాసుకొచ్చింది.
ఇక నటి ఖుష్బు తన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఫోటో ఇన్ స్ట్రా, ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో సినీ ప్రముఖులు, బీజేపీ నేతలు ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. నటి ఖుష్బు పోస్ట్ పై కీర్తి సురేష్, రాశీ ఖన్నా, శ్రియ, శ్రీదేవి విజయ్ కుమార్ సహా పలువురు హీరోయిర్లు, అభిమానులు స్పందిస్తూ.. మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఖుష్బు తన కెరీర్ లో దాదాపు వంద చిత్రాలకు పైగా నటించారు. 2000 లో సినిమాలు తగ్గించి బుల్లితెర, రాజకీయాల్లో తన సత్తా కొనసాగిస్తూ వచ్చారు. హీరోయిన్ గా మంచి కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ హీరో, దర్శకుడు సుందర్.సీ ని వివాహం చేసున్నారు. ప్రస్తుతం ఖుష్బు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.