టెక్నాలజీ పెరిగిన కొద్ది.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. కొంత కాలం నుంచి సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్ చేరారు. సైబర్ నేరగాళ్లు.. ఆమె పేరుమీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి జనాలను మోసం చేస్తున్నారు. విషయం కాస్త హీరోయిన్ దృష్టికి చేరడంతో.. ఆమె దీనిపై స్పందించారు. ఆ నంబర్ తనది కాదన్నారు. బ్లాక్ చేయమని కోరుతూ ట్వీట్ చేశారు. ఆ వివరాలు..
‘ఖిలాడి’ సినిమా హీరోయిన్ డింపుల్ హయతిని సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. వాట్సాప్ లో ఆమె పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి జనాలకు మెసేజ్ చేస్తున్నారు. డీపీ (డిస్ ప్లే పిక్చర్)లో ఫొటో చూసి కొందరు ఆమె అనుకున్నారు. అయితే… అది డింపుల్ నంబర్ కాదు. ఎవరో కేటుగాడిది. ఈ విషయం డింపుల్ హయతికి తెలియడంతో జాగ్రత్త పడ్డారు.
ఇది కూడా చదవండి : చిక్కుల్లో ఖిలాడి సినిమా! ఆ తప్పే కొంప ముంచింది!
ఈ క్రమంలో డింపుల్ హయతి ఓ నంబర్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. “ఈ నంబర్ నాది కాదు… వీళ్లు ఎవరో నా పేరు, ఫోటోతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి అందరికీ మెసేజ్ లు చేస్తున్నారు. నా నంబర్ అని చెబుతున్నారు. ఈ నంబర్ నుంచి వచ్చే మెసేజ్ లకు రెస్పాండ్ అవ్వవద్దు. బ్లాక్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. కంప్లైంట్ చేయండి” అని డింపుల్ హయతి ట్వీట్ చేశారు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Please be careful. Just don’t respond and block him and raise complaint . pic.twitter.com/a6Z47ABL6b
— Dimple Hayathi (@DimpleHayathi) February 14, 2022