కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ 2 రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌పై కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా విడుదలైంది.
కేజీఎఫ్ మూవీ పుణ్యమా అని హీరో యష్ కి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. చాలా మంది యష్ కి ఫ్యాన్స్ అయ్యారు. తాజాగా ఒక నటి, యాంకర్ అచ్చం యష్ లా నటించబోయి నవ్వుల పాలయ్యింది. ‘వయలెన్స్ వయలెన్స్ వయలెన్స్.. ఐ డోంట్ లైక్ వయలెన్స్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్ వయలెన్స్’ అని యష్ ఎంతో స్టైలీష్‌గా చెబుతాడు. ఈ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా సెలబ్రెటీ అయిన నిహారిక అచ్చం యష్ లా నటిస్తూ ఇదే డైలాగ్ స్లైలీష్‌గా చెప్పేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో ఆమెకు ఒక మందు బాటిల్ ఇస్తారు.. ఆ సీసా పట్టుకొని రక రకాలుగా తిప్పుతూ మూత తీసే ప్రయత్నంచేసింది. బాటిల్ మూత మాత్రం ఈ అమ్మడు తీయలేకపోయింది.
తనకు మరో బాటిల్ ఇవ్వమని అడుగుతుంది.. దాని మూత తీసేందుకు ట్రై చేస్తుంది.. కానీ రాదు. అదే సమయానికి హీరో యష్ అక్కడికి వచ్చి సింపుల్ గా బాటిల్ మూత తీస్తాడు. వయలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్ వయలెన్స్.. అని యష్ తన స్టైల్లో చెప్పేస్తాడు. నిహారిక అయ్యో నా బాటిలో తీసుకు వెళ్తున్నాడే.. సరే కనీసం మంచి నీళ్లు ఇవ్వండి అంటూ బాబూ అంటూ నిరాశగా అడుగుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.