రాకింగ్ స్టార్ యష్ గురించి ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. KGF చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో అటు కన్నడ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. తాజాగా కేజీఎఫ్-2 మూవీతో 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు చేశాడు. అయితే.. ఇంతకాలం షూటింగ్ తో బిజీ అయిన యష్.. కేజీఎఫ్ రిలీజ్ అయ్యాక దొరికిన సమయాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా యష్ ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి వెకేషన్స్‌కు వెళతాడు. లేదంటే ఇంట్లోనే పిల్లలతో టైమ్ పాస్ చేస్తాడు. ఈ క్రమంలో ఇటీవల కూతురు ఐరాతో యశ్ తన డేను స్టార్ట్ చేశాడు. ఉదయం లేవగానే ఐరాతో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ‘సలాం రాఖీ భాయ్’ అంటూ ఐరా పాట కూడా పాడింది. తాజాగా మరోసారి కూతురు ఐరా, కొడుకు యథర్వ్ లతో డే స్టార్ట్ చేసిన వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
A ‘Wild’ start to our Wednesday! pic.twitter.com/H2DPsn00zA
— Yash (@TheNameIsYash) May 11, 2022