Yash: కేజీఎఫ్ సినిమాతో కన్నడ చలన చిత్ర పరిశ్రమకు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. కలెక్షన్ల పరంగా వందల కోట్లు గడించిన ఈ సినిమా నిర్మాతలను లాభాల్లో ముంచెత్తింది. రెమ్యునరేషన్ పరంగా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌ల స్థాయి డబుల్ అయింది. నిన్న మొన్నటి వరకు లక్షల్లో ఉన్న యశ్ నెల ఆదాయం కాస్తా ఇప్పుడు కోట్లకు చేరింది. కేజీఎఫ్ 1 ముందు వరకు యశ్ రెమ్యునరేషన్ 3 కోట్ల రూపాయలు. కేజీఎఫ్ 1కు పెరిగిన రెమ్యునరేషన్‌తో దాదాపు 5 కోట్లు తీసుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవటంతో రెమ్యునరేషన్ దాదాపు 4 రెట్లు పెరిగింది. కేజీఎఫ్ 2కు 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. నిన్నటి మొన్నటి వరకు నెలకు 50 లక్షల రూపాయలు సంపాదించే యశ్.. ఇప్పుడు 2 కోట్ల రూపాయల మేర సంపాదిస్తున్నాడు. యాడ్స్ ఆదాయం కూడా పెరిగింది.
గూచీ రష్ పెర్ఫ్యూమ్, బియర్డో బ్రాండ్‌లను ప్రమోట్ చేయడానికి రాకీ భాయ్ రూ.60 లక్షలు తీసుకుంటున్నారు. తాజాగా, 6 కోట్ల రూపాయలు విలువచేసే ఓ ఇంటిని కొన్నారు. ఇళ్లు, స్థలాలు, కార్లు, ఇతర వాటిని కలుపుకుని, 2022గానూ యశ్ ఆస్థి విలువ దాదాపు 53 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. కాగా, ‘నంద గోకుల’ అనే సీరియల్‌తో బుల్లి తెరకు పరిచయమయ్యారు యశ్. 2008లో వచ్చిన ‘‘మొగ్గిన మనసు’’ సినిమాతో హీరో అయ్యారు. తనతో కలిసి నటించిన రాధికా పండిట్‌ను ప్రేమించి, పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కెరీర్‌లో రామాచారి, మాస్టర్ పీస్, కేజీఎఫ్‌లతో భారీ హిట్లను అందుకున్నారు. మరి, సీరియళ్లనుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Swetha Varma: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేత వర్మకి చేదు అనుభవం! ఎమోషనల్ పోస్ట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.