ప్రశాంత్ నీల్.. ఇది పేరు మాత్రమే కాదు. సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. కేవలం మూడే మూడు సినిమాలతో ఇతను మరో రాజమౌళి అని ప్రశంసించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తూనే ఉన్నాం. సినిమాని ఇలానే తీయాలి అనే ధోరణి నుంచి ఇలా కూడా తీయొచ్చా? అని అబ్బురపరిచేలా సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాడు. అయితే అసలు ప్రశాంత్ నీల్ ఎలా డైరెక్టర్ అయ్యాడు? అతను డైరెక్టర్ అయ్యేందుకు ఎవరు కారణం? అనే విషయాలు తెలుసుకుందాం.
ఇదీ చదవండి: KGF 2 Collections: 5వ రోజూ అదిరిపోయే కలెక్షన్స్!
ప్రశాంత్ నీల్ చదువులో దిట్టేం కాదు. ఎంతో కష్టపడి ఇంటర్ చదివాడు. లెక్కలు అంటే ఎంతో భయం ఎప్పుడూ తనకు లెక్కల పరీక్షలో డబుల్ డిజిట్ మార్కులు వచ్చింది లేదు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఫిలిం కోర్స్ నేర్చుకోవడానికి పూణే వెళ్ళాడు. అయితే వాళ్లు కేవలం ఇంటర్ మీద ఫిలిం కోర్సు చేయడం కుదరదు.. డిగ్రీ పూర్తిచేసి రావాలని చెప్పారు. ప్రశాంత్ నీల్ కు తెలుసు డిగ్రీ పూర్తి చేయడం అంటే అతనికి ఎంతో కష్టం అని. కానీ, ఫిలిం కోర్సు కోసం ఎంతో కృషి చేసి డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఫిలి కోర్సు నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియక 7 సంవత్సరాలు హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకుంటున్నాడో కూడా అతనికీ తెలియదు. కేవలం టైమ్ పాస్ చేయాలి కాబట్టి నేర్చుకున్నాడు. ఆ క్రమంలో గుర్రం పందేలు కూడా బాగానే ఆడేవాడు.అయితే రోజులు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతోంది. ఫిలి కోర్సు చేశాడు.. కానీ సినిమా తీయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. డైరెక్టర్ గా ఎవరు అవకాశం ఇస్తారో తెలియక కాలం వృథా చేస్తూ వచ్చాడు. అయితే తాను కాలం వృథా చేస్తున్న విషయాన్ని ఓరోజు గ్రహించాడు. ఎలాగైనా తన లక్ష్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఓరోజు తన బావమరిది మురళి దగ్గరకు వెళ్లి నేను డైరెక్టర్ అవుతా.. సినిమా తీస్తాను అని చెప్పాడు. మురళి ప్రశాంత్ నీల్ మాటలు నమ్మలేదు. అతను సినిమా విషయంలో సీరియస్ గా లేడు అనుకున్నాడు. కానీ, ప్రశాంత్ నీల్ కు ఓ అవకాశం ఇద్దామని సేవంతి సేవంతి అనే సినిమా షూటింగ్ పర్యవేక్షించేందుకు తీసుకెళ్లాడు. ఆ సినిమా షూటింగ్ గమనించి ప్రశాంత్ నీల్ నేర్చుకుంది ఏమీ లేదు.
ఇదీ చదవండి: రాయలసీమ గడ్డపై RRR అరుదైన రికార్డ్.. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి!
కానీ, అనుకున్నదే తడవుగా సినిమా తీయాలని పట్టుబట్టాడు. సినిమా విషయంలో ఇంట్లో వాళ్లను, బావ మరిది, తన అన్నను ఒప్పించాడు. అన్న ప్రొడ్యూసర్ గా, బావ మరిది హీరోగా ఉగ్రం సినిమా తీశాడు. సినిమా విడుదలైన తర్వాత అది ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. తన బావమరిది మురళి చొరవతోనే ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా మారే అవకాశం వచ్చింది. ఆయన సినిమాలు అందరికీ కొత్తగా అనిపించడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే సినిమా ఎలా తీయాలి? దానికున్న రూల్స్ ఏంటి అనేవి ఏమీ ప్రశాంత్ నీల్ కు తెలియదు. అందుకే కొత్తగా అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి సినిమా తీస్తున్నాడు కాబట్టే అతని సినిమాలు ప్రేక్షకులకు ఎంతో కొత్తగా అనిపిస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.