కేజీఎఫ్.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రీసౌండ్ గా వినిపిస్తున్న పేరు ఇది. ఆ తర్వాత వినిపిస్తున్న పేర్లు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్. కేజీఎఫ్ తర్వాత పెరిగిన భారీ అంచనాలను అందుకోవడంలో వీళ్లిద్దరూ బిగ సక్సెస్ సాధించారనే చెప్పాలి. నిజానికి అంచనాలకు మించి అలరించారని చెప్పాలి. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రశాంత్ నీల్, యశ్ కు అభిమానులు పెరిగిపోయారు. బాలీవుడ్ లో అయితే మాటల్లో చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇదీ చదవండి: KGF-2 మూవీపై అక్కినేని అఖిల్ క్రేజీ కామెంట్స్.. పోస్ట్ వైరల్!
ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుందో. ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా మొదలైంది? కేజీఎఫ్ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పుకొచ్చాడు. అయితే కేజీఎఫ్ తర్వాత ఎవరైనా బిగ్ సెలబ్రిటీ మీకు ఫోన్ చేశారా అని అడగగా.. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తనకు కాల్ చేశారని చెప్పాడు. ఈ పూర్త ఇంటర్వ్యూ ఇంకా రిలీజ్ కాలేదు. అందులో అసలు మహేశ్ బాబు, తారక్ ఎలా స్పందించారు అనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ కూడా మంచి ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంది కాబట్టి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.