దక్షిణాది చిత్ర పరిశ్రమలో KGF సినిమా రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా విడుదలై అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మండమైన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లను సైతం రాబట్టింది. ఇక ఊహించని విజయాన్ని సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. యశ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ గురువారం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాలొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ హీరో గురించి వివరించాడు.
ఇది కూడా చదవండి: మందు తాగుతాను.. ఆ టైంలోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్
నాకు నచ్చిన హీరో చిరంజీవి అని ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పాడు. ఇక నాకు స్ఫూర్తి కూడా ఆయనేనని స్పష్టం చేశాడు. ఆయన సినిమాల్లో హీరోకి ఇచ్చే ఇలివేషన్స్ నాకు ఎంతో ఇష్టమని అలాగే మాస్ ఎలివేషన్స్ సీన్స్ కూడా చాలా ఇష్టమంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్నాడు. ఇక కుదిరితే చిరంజీవితో ప్రశాంత్ నీల్ ఓ సినిమా తీస్తే బాగుండని చిరు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిపై ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.