కేజీఎఫ్ చాప్టర్ 1 తర్వాత కన్నడ హీరో యష్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగుతో సహా అన్ని ఇండస్ట్రీల్లో అభిమానులను సంపాదించుకున్నారు యష్. కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు యష్. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ సినిమా టీమ్ వైజాగ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: యష్ రియల్ లైఫ్ స్టోరీ.. ఎన్నో కష్టాలు పడ్డాక రాఖీబాయ్‌గా..
వైజాగ్‌లో నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి యష్ కాస్త ఆలస్యంగా వచ్చారు. అందుకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరైన సుమన్ టీవీ యాంకర్.. మాట్లాడుతూ.. యష్.. సారీ అంగీకరించాలంటే.. కేజీఎఫ్‌లోని వైలెన్స్ డైలాగ్ చెప్పాల్సిందిగా కోరారు. ఆమె డేరింగ్‌కి యష్ ఫిదా అయ్యారు. మీరు చాలా షార్ప్ అండి అంటూ ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత యష్ మల్టీ స్టారర్ సినిమాలో చేసే అంశం గురించి మాట్లాడి.. వైలెన్స్ డైలాగ్ చెప్పారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. యష్ సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండిది.