రాకీ భాయ్.. బాక్సాఫీస్ బాద్ షా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ చూస్తేనే ఆ విషయం అర్థమై పోతుంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో కనక వర్షం కురిపిస్తూనే ఉంది. ప్రశాంత్ నీల్ విజువల్ వండర్, ఎలివేషన్ కా బాప్ రాకీ భాయ్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. నాలుగో వారంలోకూడా ఎలాంటి మార్పు లేకుండా దూసుకుపోతోంది. ది వరల్డ్ ఈజ్ మై టెరిటరీ అనే డైలాగుకు తగ్గుట్లుగానే కలెక్షన్స్ పర్వం కూడా ఉంది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఓ భారీ రికార్డును కొల్లగొట్టింది. అదేంటంటే రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ట్రిపులార్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి బయ్యర్, డిస్టిబ్యూటర్, ఎగ్జిబిటర్ అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది.
ఇదీ చదవండి: ‘మార్వెల్ యూనివర్స్’లా KGF సిరీస్! క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
రాజమౌళి, తారక్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ట్రిపులార్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ ను కేజీఎఫ్ ఛాప్టర్ 2 క్రాస్ చేసింది. ట్రిపులార్ సినిమాకి 1,127 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా 1162.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఇంకా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన మూడో ఇండియన్ సినిమాగా రికార్డుల కెక్కింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 కంటే ముందు 2024 కోట్లతో దంగల్, 1810 కోట్లతో బాహుబలి-2 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా హిందీలోనూ రికార్డులు తిరగ రాస్తూనే ఉంది. బాలీవుడ్ లో దాదాపు 420 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇంక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయానికి వస్తే.. 1200 కోట్ల క్లబ్ లో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#KGFChapter2 WW Box Office
REFUSES to give up to new releases.
Week 1 – ₹ 720.31 cr
Week 2 – ₹ 223.51 cr
Week 3 – ₹ 140.55 cr
Week 4
Day 1 – ₹ 11.46 cr
Day 2 – ₹ 8.90 cr
Day 3 – ₹ 24.65 cr
Day 4 – ₹ 25.42 cr
Day 5 – ₹ 8.07 cr
Total – ₹ 1162.87 cr— Manobala Vijayabalan (@ManobalaV) May 10, 2022
#KGF2 is the only Big Movie this year so far in Telugu States that is profitable right from the Distributor to the Small Exhibitor, each and every party concerned in All Areas. #KGFChapter2 pic.twitter.com/0plg8GerRr
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 11, 2022