బాక్సాఫీస్ మాన్‌స్టర్ రాఖీ భాయ్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాడు. కేవలంలో నాలుగు రోజుల్లో 550 కోట్లు గ్రాస్ రాబట్టి ఔరా అనిపించాడు. నాలుగో రోజు కూడా కేజీఎఫ్ 2 హవాలో ఏ మాత్రం మార్పులేదు. బాలీవుడ్ ప్రేక్షకులు ప్రశాంత్ నీల్– రాఖీ భాయ్ కి నీరాజనాలు పడుతున్నారు. స్ట్రైట్ హిందీ సినిమాలకు సాధ్యంకాని స్థాయిలో కేజీఎఫ్ వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లో రూ.410 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 నాలుగో రోజు బాక్సాఫీస్ పై విరుచుకుపడింది.
మొదటి మూడ్రోజుల కలెక్షన్స్ తో పోలిస్తే నాలుగో రోజు ఫస్ట్ డే హవా కనిపిచింది. ఇంక రాఖీ భాయ్ స్పీడ్ చూస్తే 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు పెద్దగా సమయం పట్టేలా కనిపించడం లేదు. ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ కూడా బాగా ఉన్నారనే చెప్పాలి. రోజుల ప్రకారం అసలు కేజీఎఫ్ ఛాప్టర్ 2 నాలుగు రోజుల్లో ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో చూద్దాం.
డే 1- 165.37 కోట్లు
డే 2 – 139.25 కోట్లు
డే 3- 115.08 కోట్లు
డే4- 132.13 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ నాలుగురోజుల గ్రాస్- 551.83 కోట్లు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.