ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ పార్ట్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బంపర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2పై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను హై రేంజ్‌లో డైరెక్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా బంపర్ హిట్ సాధించడమే కాక.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాలో నటించిన ఏ ఒక్కరిని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. అలా కేజీఎఫ్ రెండు పార్ట్స్‌లో కనిపించిన పాత్ర ఖాసీం చాచా. అనాథ అయిన రాకీని చేరదీసి.. చివరి వరకు అతడి తోడుగా ఉంటాడు. పార్ట్ 2లో కూడా ఈ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇలా ఖాసీం చాచా పాత్రలో ఆకట్టుకున్న నటుడి పేరు హరీశ్ రాయ్. కేజీఎఫ్‌లో తన నటనతో అందరిని మెప్పించిన హరీశ్ రాయ్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్నాడు. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ వివరాలు..
హరీశ్ రాయ్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరు కిద్వాయ్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. ఇప్పటికే అతడి ఊపిరితిత్తులకు ఆపరేషన్ కాగా.. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోరుకోవాలంటే.. మరో సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు చేసిన వైద్యం కోరకు విపరీతంగా ఖర్చయ్యిందని.. మిగతా చికిత్స కోసం ప్రస్తుతం తన దగ్గర రూపాయి కూడా లేదని.. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని హరీశ్ రాయ్ వేడుకుంటున్నాడు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న హరీశ్ రాయ్.. తన సమస్య గురించి ఎవరికి చెప్పకుండా దాచి పెట్టారు. దీని గురించి ఆయనను ప్రశ్నించగా.. ‘‘నాకు థైరాయిడ్ ఉందేమో అని అనుమానం ఉంటుండే. అదుకే పరీక్షలు చేయించుకున్నాను. కానీ ఆశ్చర్యంగా క్యాన్సర్ అని తెలిసింది. ఎంతో భయపడ్డాను. దీని గురించి బయటకు వెల్లడిస్తే.. అవకాశాలు రావని ఎవరికి చెప్పలేదు. క్యాన్సర్‌తో బాధపడుతున్న నన్ను సినిమాల్లోకి తీసుకోరనే భయంతోనే ఎవరికి చెప్పలేదు. ప్రస్తుతం నాకు డబ్బు చాలా అవసరం. సాయం చేయండి’’ అని అర్థించాడు
హరీశ్ అనారోగ్య సమస్య గురించి తెలిసిన వెంటనే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు.. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఆయనకు తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్, రాకీ భాయ్ కూడా సాయం చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.