ఇండియన్ బాక్సాఫీస్ పై సౌత్ నుండి సినిమాను మించి మరో సినిమా దండయాత్రను కొనసాగిస్తున్నాయి. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి RRR మూవీతో క్రియేట్ చేసిన రికార్డులను మరవకముందే.. ఇప్పుడు కేజీఎఫ్-2 మూవీతో దర్శకుడు ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్-2 బాక్సాఫీస్ దండయాత్ర చూసి ఇండియాకి మరో రాజమౌళి దొరికాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కేజీఎఫ్ లో రాకీభాయ్ గా రాకింగ్ స్టార్ యష్ నటించగా, శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. రిలీజైన మొదటి రోజునుండే పైసా వసూల్ మూవీ అని నిరూపించిన కేజీఎఫ్-2.. 4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో కేజీఎఫ్-2 ఇంపాక్ట్ భారీ స్థాయిలో నెలకొంది. అందుకే అసలు భాషలో కంటే డబ్బింగ్ భాషలో 200 కోట్లు వసూల్ చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 కలెక్షన్స్, రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి 4వ రోజు వరకు కేజీఎఫ్-2 వరల్డ్ వైడ్, లాంగ్వేజ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం!
కన్నడ:
4 Days – ₹ 91.10Cr
హిందీ:
Day 1 – ₹ 53.95Cr
Day 2 – ₹ 46.79Cr
Day 3 – ₹ 42.90Cr
Day 4 – ₹ 50.35Cr
Total – ₹ 193.99Cr
తమిళం:
4 Days – ₹ 32.10Cr
మలయాళం:
4 Days – ₹ 29.05Cr
తెలుగు:
4 Days – ₹ 84.80Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా:
4 Days – ₹ 29.01Cr
ఓవర్సీస్:
4 Days – ₹ 97.40Cr
వరల్డ్ వైడ్(గ్రాస్) – ₹ 557.45Cr
మరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న కేజీఎఫ్-2 మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#KGFChapter2 WW Box Office
CROSSES ₹500 cr milestone mark in just 4 days.
Day 1 – ₹ 165.37 cr
Day 2 – ₹ 139.25 cr
Day 3 – ₹ 115.08 cr
Day 4 – ₹ 132.13 cr
Total – ₹ 551.83 cr#2 at the global box office after fantastic beasts. #Yash #KGF2
— Manobala Vijayabalan (@ManobalaV) April 18, 2022