ప్రపంచమంతా ఇప్పుడు కేజీఎఫ్-2 సినిమా గురించే మాట్లాడుకుంటుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన KGF-2 భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ షో నుండే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
మొదటిరోజే కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. కేజీఎఫ్ ఛాప్టర్-1 కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ.. ఫస్ట్ పార్ట్ ను మించిన రెట్టింపు హిట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రాకీభాయ్ హవా ఉండబోతుందో ఊహించలేకపోతున్నారు. అయితే.. కేజీఎఫ్-2 లో హై లెవెల్ ఎలివేషన్స్ తో పాటు బాక్సులు బద్దలైపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉండటంతో థియేటర్లలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇది చదవండి: తెలుగునాట KGF-2 ప్రభంజనం.. బాహుబలి 2 రికార్డులు బద్దలు!తాజాగా ఎవరు ఊహించని విధంగా కేజీఎఫ్-2 మూవీ రన్ అవుతున్న ఓ థియేటర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రీసౌండ్ కి స్పీకర్లు బద్దలైపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. మల్కాజిగిరిలోని రాఘవేంద్ర 35 ఎంఎం థియేటర్లో కేజీఎఫ్-2 రీసౌండ్ కు ఏకంగా సౌండ్ బాక్సులు ఊడి కిందపడిపోయినట్లు సమాచారం. ఆ స్పీకర్లు ఊడిపడే సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం షోను రద్దు చేసి.. ప్రేక్షకులకు టికెట్ డబ్బులు రిటర్న్ చేసినట్లు తెలుస్తుంది.
గురువారం సాయంత్రం థియేటర్లో కేజీఎఫ్-2 షో రన్ అవుతుండగా.. ఫ్యాన్స్ అంతా సౌండ్ ఇంకా పెంచాలని డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ కోరిక మేరకు.. నిర్వాహకులు సౌండ్ ఇంకాస్త పెంచారు. దీంతో థియేటర్ స్పీకర్లు ప్రేక్షకులకు దూరంగా ఊడిపడ్డాయట. మంచి ఊపులో సినిమా రన్ అవుతుండగా ఇలా జరిగేసరికి ప్రేక్షకులు టికెట్ డబ్బులు తీసుకొని నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు. మరి కేజీఎఫ్-2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.