కన్నడ స్టార్ యష్ నటించిన ‘KGF చాప్టర్ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే 1000కోట్ల క్లబ్ లో చేరి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. ఇప్పుడు మూడో వారం కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ.. సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ యాక్షన్ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా కేజీఎఫ్-2 సినిమా OTT హక్కులు ఊహించని ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వారు కేజీఎఫ్-2 కోసం భారీ డీల్ ఫిక్స్ చేసిందట. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఇక KGF 2 మూవీ OTT హక్కులను రికార్డు స్థాయిలో దాదాపు రూ. 320 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ మరియు మలయాళం భాషల్లో ఈ సినిమా ఒకేసారి మే 27 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
2018లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన KGF-1కి సీక్వెల్ గా రూపొందింది ఈ సినిమా. 1970ల నాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మాఫియా ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అద్భుతమైన లాభాలతో దూసుకుపోతున్న కేజీఎఫ్-2 మూవీలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, అర్చన జోయిస్, ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1 కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న విషయం విదితమే. మరి కేజీఎఫ్-2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.