ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సృష్టిస్తున్న ‘KGF-2’ సినిమా చూసిన వాళ్లందరికి రాకీభాయ్ వాడిన ‘కలాష్నికోవ్’ రైఫిల్ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే.. సినిమాలో ఈ రైఫిల్ సృష్టించిన విధ్వంసం అలాంటిది. ముఖ్యంగా సినిమాలో అధీరాను పడగొట్టే సన్నివేశంలో విశేషంగా ఆకట్టుకుంది. రాకింగ్ స్టార్ యష్ ‘కలాష్’ సైన్యంతో అధీరా సైన్యాన్ని మట్టుపెడతాడు. కలాష్ పనితనాన్ని బిగ్ స్క్రీన్ పై చూసినవారు ఆ సీన్ ఎప్పటికీ మర్చిపోలేరు.
*కేజీఎఫ్-2లో కలాష్ విధ్వంసం చూశాక అందరూ అసలు ఈ ‘కలాష్నికోవ్’ రైఫిల్ చరిత్ర ఏంటని గూగుల్ లో వెతుకుతున్నారు. అయితే.. ‘కలాష్నికోవ్’ గన్ ఎక్కడ నుండి వచ్చింది? దాని పుట్టుపూర్వం ఏంటనే విషయాలు ఇప్పుడు చూద్దాం!
*ప్రపంచవ్యాప్తంగా కలాష్నికోవ్ సిరీస్ తుపాకులను 106 గుర్తింపు పొందిన దేశాల స్టాండింగ్ ఆర్మీలలో విస్తృతంగా ఉపయోగించినప్పటికీ.. సైనికులు, ఉగ్రవాదులకు గుర్తుగా మారాయి.
*కలాష్నికోవ్ రైఫిల్‌ని AK-47 అని కూడా అంటారు. మిఖాయిల్ టిమోఫీవిచ్ కలాష్నికోవ్ అనే వ్యక్తి దీనికి పేరుపెట్టారు. 1947వ సంవత్సరం.. రష్యాలో కలాష్నికోవ్ తుపాకీని కనుగొన్నాడు.
*AK అంటే “ఆటోమేటిక్ కలాష్నికోవ్” అని అర్థం. 47 అంటే అది కనిపెట్టిన సంవత్సరానికి గుర్తు.
*ప్రస్తుతం 20 కంటే ఎక్కువ దేశాలలో AK-47 విభిన్న రూపాంతరాలు చెందింది. ప్రపంచంలోనే అతిపెద్ద AK-47 ని చైనా
ఉత్పత్తి చేసింది.
*AK-47ని సులభంగా తయారు చేయవచ్చు. ఆ కారణంగానే ప్రపంచంలో అత్యధికంగా తయారు చేయబడిన తుపాకీ అయ్యింది. అలాగే చాలా అరుదైన రైఫిల్స్‌లో ఒకటి. ఇది నీటిలో మునిగినప్పుడు కూడా కాల్పులు జరుపుతుంది.
*ఇది 300 మీటర్ల పరిధిలోపు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే.. ప్రో-షూటర్లు దీనితో 800 మీటర్ల పరిధివరకు కూడా షూట్ చేయగలరు.
*దీని ధర “బ్లాక్ మార్కెట్” పాకిస్థాన్‌లో కేవలం రూ. 7,000, ఆఫ్ఘనిస్తాన్‌లో రూ. 3,000 వరకు ఉంటుంది.
*కలాష్నికోవ్ రైఫిల్ అకా AK47 సిరీస్ రైఫిల్ ప్రపంచంలో అత్యంత సాధారణ ఆయుధంగా “గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్”లో ఉంది. ప్రస్తుతం 100 మిలియన్లకు పైగా AK రైఫిల్స్ ఉన్నాయి.
*కలాష్నికోవ్ రైఫిల్ ప్రపంచంలోని 106 దేశాల సైన్యాలు మరియు ప్రత్యేక విభాగాలకు వినియోగంలో ఉంది.
*మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొన్ని ఆఫ్రికన్ ప్రాంతాలలో కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్ ని ‘కలాష్’ అనే పేరుతో పిలుస్తారు.
*ప్రతి ఏడాది సుమారు 250,000 మంది AK బారిన పడుతున్నారని సమాచారం.