సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా హిట్స్ కొట్టకపోయినా.. కొంతమంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆడియెన్స్ మతులు పోగొడుతుంటారు. ఎప్పుడు డెబ్యూ చేశామన్నది కాదు.. ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాం.. ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని వెనకేసుకున్నాం అనేది ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీ కూడా ఆ కోవకే చెందుతుంది కాబోలు. ఎందుకంటే.. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా.. గ్లామర్ ప్రియులను తన అందాలతో అల్లాడిస్తుంటుంది. కేతికా శర్మ.. ఈ పేరు వినే ఉంటారు. వినడం ఏంటి ఏకంగా అమ్మడి సినిమాలు కూడా చూసే ఉంటారు. అవును కదా!
2021లో ‘రొమాంటిక్’ మూవీతో హీరోయిన్ గా డెబ్యూ చేసిన ఈ ఢిల్లీ సోయగం.. ఫస్ట్ మూవీ అయినప్పటికీ తనలోని బోల్డ్ నెస్ ని పూర్తిగా కాకపోయినా కాస్తంత కుర్రకారుకి పరిచయం చేసింది. ఇంకేముంది పెదవి ముద్దులు, రొమాంటిక్ సన్నివేశాలు.. బోల్డ్ అందాలతో దెబ్బకు పురుష పుంగవులను ఫిదా చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాలు చేసినప్పటికీ.. కేతికకి మొదటి హిట్ పడలేదు. చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యేసరికి అమ్మడు సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది. వరుసగా ఘాటైన అందాలు కనిపించేలా.. హాట్ ఫోటోషూట్స్ తో నెట్టింట సెగలు రేపుతోంది.
ఆ విధంగానైనా అభిమాన హీరోయిన్ వార్తల్లో నిలుస్తున్నందుకు ఆనందంగా ఉందనే బ్యాచ్ కూడా ఉన్నారు. కాగా.. తాజాగా కేతికా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఫోటోలలో కేతికా అందాల ప్రదర్శన పెద్దగా లేదుగాని.. కుర్రాళ్ళు మాత్రం అలా చూస్తూ ఉండిపోతారంతే. అందుకు కారణం మత్తెక్కించే చూపులు. అవును.. అమ్మాయలు ఏం చేసినా అందంగా ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు.. అనడానికి ఇప్పుడు కేతికా పెట్టిన ఫోటోలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరి కేతికా శర్మ కొత్త ఫోటోలు చూసినట్లయతే.. ఆమె బ్యూటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.