కీర్తి సురేష్ మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి పెళ్లిపై ఆమెకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా, మరోసారి ఆమెకు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె అసహనానికి గురైంది.
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపై గతకొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వ్యక్తితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీంతో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి.. కీర్తి ప్రియుడని, త్వరలో ఆమె అతడ్ని పెళ్లి చేసుకోబోతోందని పలు మీడియా సంస్థలు వార్తలు కూడా రాసేశాయి. ఈ ఫొటోపై కీర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడు మాత్రమేనని, అనవసరంగా పుకార్లు క్రియేట్ చేయవద్దని స్పష్టం చేశారు.
ఆ తర్వాత కీర్తి తండ్రి సురేష్ తండ్రి కూడా ఈ పెళ్లి వార్తలపై స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలు నమ్మవద్దని జనాలకు విజ్ఞప్తి చేశారు. కీర్తి, ఆమె తండ్రి సురేష్ క్లారిటీ ఇచ్చినా ఆమె పెళ్లిపై నెలకొన్న సందిగ్ధత వీడటం లేదు. తాజాగా, మరోసారి కీర్తి సురేష్‌కు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది. ఓ సినిమా వేడుకలో పాల్గొన్న కీర్తిని ఓ మీడియా ప్రతినిధి పెళ్లి గురించి ప్రశ్న అడిగాడు.
ఆ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘ నేను ఎలాంటి క్లూలు ఇవ్వలేదండి. నేను ఏమీ చేయలేదు. నేను ఆల్‌రెడీ అంతా క్లియర్ చేశాను. ఏంటండి.. మీరు నాకు పెళ్లి చేయటంలోనే ఇంకా ఉన్నారు. పెళ్లి జరిగే సమయంలో నేనే చెబుతాను’’ అంటూ ఒక రకంగా అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.