టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎవరితోనూ ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ గాసిప్స్‌పై ఆమె స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా యంగ్ ఆడియెన్స్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘నేను లోకల్’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘మహానటి’తో స్టార్డమ్ సంపాదించారు. ‘సర్కారు వారి పాట’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న కీర్తి.. ‘దసరా’తో ఇటీవలే మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. గ్లామర్ పాత్రలే గాక నటనకు ఆస్కారం ఉన్న రోల్స్‌లో నటించేందుకు ఆమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి ‘మహానటి’, ‘దసరా’ ఫిల్మ్స్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం ‘భోళా శంకర్’, ‘రివాల్వర్ రీటా’, ‘రఘు తాత’ మూవీస్‌లో నటిస్తూ ఆమె బిజీబిజీగా ఉన్నారు. ఈ టైమ్‌లో కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి.
కీర్తి సురేష్ లైఫ్‌లో ఒక మిస్టరీ మ్యాన్ ఉన్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై ఆమె స్పందించారు. అలాంటి మిస్టరీ మ్యాన్ ఎవరూ తన జీవితంలో లేరని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈసారి తన బెస్ట్ ఫ్రెండ్‌ను వార్తల్లోకి లాగారని.. నిజమైన మిస్టరీ మ్యాన్‌ను టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తానన్నారు కీర్తి. అప్పటిదాకా తన మ్యారేజ్ విషయంలో చిల్‌గా ఉండాలన్నారామె. ఒక్కసారి కూడా సరైన న్యూస్ రాయలేదన్నారు. ఇకపోతే, కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌తో ఆమె లవ్‌లో ఉందని రూమర్స్ రాగా.. దీన్ని కీర్తి సురేష్ తల్లి మేనక ఖండించారు. తర్వాత కొన్నాళ్లకు ఒక వ్యక్తితో ఆమె దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మొత్తానికి అతడు కీర్తి ఫ్రెండ్ అని తేలిపోయింది. ఇప్పటికైనా ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి.
Hahaha!! Didn’t have to pull my dear friend, this time!
I will reveal the actual mystery man whenever I have to 😉
Take a chill pill until then!PS : Not once got it right 😄 https://t.co/wimFf7hrtU
— Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023