ప్రస్తుతం కీర్తి సురేశ్.. దసరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది. మార్చి 30న ఈ సినిమా విడుదల అవుతుంది. ప్రసుత్తం దసరా టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో కీర్తి చేసిన పనికి నానితో సహా ప్రతి ఒక్కరు షాకవుతున్నారు. ఆ వివరాలు..
కీర్తి సురేశ్ పేరు వినగానే.. సావిత్రి జీవిత కథలో నటించిన మహానటిగా మాత్రమే ప్రేక్షకులకు గుర్తుకు వస్తుంది. కీర్తి ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి డీసెంట్ పాత్రలు, లుక్‌తోనే ప్రేక్షకులను అలరించింది. అయితే వెనకబడుతున్నాను అని భావించిందో ఏమో కానీ.. ఈ మధ్య గ్లామర్ షో విషయంలో గేట్లు ఎత్తేసింది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ రచరచ్చ చేస్తోంది. తాజాగా తనలోని మరో టాలెంట్ బయటపెట్టి.. ఫ్యాన్స్‌కి ఊహించని షాకిచ్చింది మహానటి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేశ్.. నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా చిత్రంలో నటించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడమే కాక సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ మధ్య తెలంగాణ స్లాంగ్‌లో వచ్చిన సినిమాలు భారీ విజయం సాధిస్తుండటంతో.. దసరా మీద కూడా ఆ రేంజ్‌లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. దసరా టీమ్.. సౌత్ టూ నార్త్.. అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కీర్తి సురేశ్ చేసిన పనికి అంతా అవాక్కవుతున్నారు.
ప్రసుత్తం దసరా టీమ్.. మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లింది. కీర్తి సురేశ్, నానిలతో పాటు దగ్గుబాటి రానా కూడా వెళ్లాడు. దసరా సినిమాలో చాలా సీన్లలో తాను తాగి నటించినట్లు నాని ఇప్పటికే అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక సీన్‌లో అయితే నాని ఎత్తిన బాటిల్‌ను దించకుండా తాగేశారట. ఇక ముంబైలో ప్రమోషన్ సందర్భంగా నాని మరోసారి సినిమాలోలానే బాటిల్ దించకుండా కల్లు తాగాడు. రానా కూడా నాని స్టైల్లో కల్లు తాగాడు. వీరిద్దరితో పోటీ పడుతూ కీర్తి సురేశ్ కూడా ఎత్తిన బాటిల్ దించకుండా కల్లు తాగి.. అందరికి షాకిచ్చింది.
కీర్తి చేసిన పనికి రానా, నాని ఆశ్చర్యపోయారు. కానీ కీర్తి మాత్రం.. ఎత్తిన బాటిల్ దించకుండా తాగి.. సింపుల్‌గా దాన్ని పక్కకు పడేసి.. హీరోల వైపు ఓ లుక్కు విసిరింది. అయితే వీరు తాగింది కల్లు అని కొందరు అంటుండగా.. కాదు నిమ్మరసం అని మరి కొందరు అంటున్నారు. కానీ కీర్తి సురేశ్ చేసిన పనికి మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.