తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి కీర్తి సురేష్. దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది హీరోయిన కిర్తీ సురేష్. ఈ సినిమాతో కీర్తి గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక గతంలో స్టార్ హీరోల సరసన ఆడి పాడిన విషయం చాలా మందికి తెలియదు. అవును మీరు విన్నది నిజమే.
మేనక 1980లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పున్నమి నాగు’ సినిమాలో చిరు సరసన పూర్ణిమ అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇక మేనక తన అందం అభినయంతో అప్పట్లో తెలుగు తమిళం వంటి భాషలే కాకుండా అనేక భాషల్లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే తల్లి చిరుకి హీరోయిన్ గా నటిస్తే ఇప్పుడు కూతురు కీర్తి సురేష్ చిరుకి చెల్లి పాత్రలో నటించబోతోంది. మేహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటించి మెప్పించనుంది. ఈ మూవీకి సంబంధించిన కీర్తి సురేష్ లుక్స్ కూడా విడుదల చేసింది మూవీ యూనిట్.