ఒకే ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు హీరోయిన్ కావ్యా కల్యాణ్‌రామ్. ‘బలగం’లో పక్కింటి అమ్మాయి పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలకరించి అందరి దృష్టిలో పడ్డారు.
సినిమాల్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తుంటారు. వారిలో కొందరు బాగా ఫేమస్ కూడా అవుతారు. మంచి ట్యాలెంట్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టులకు వరుసగా అవకాశాలు వస్తుంటాయి. వారిలో పెద్దయ్యాక స్టార్లుగా మారిన వాళ్లూ ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు హీరోయిన్ కావ్యా కల్యాణ్‌రామ్. ‘గంగోత్రి’, ‘బాలు’ లాంటి సినిమాలతో చైల్డ్ ఆర్టిస్టుగా అప్పట్లో మంచి క్రేజ్ సంపదించారు కావ్య. క్యూట్‌గా ఉండటం, బాగా నటిస్తుండటంతో ఆమెను వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్టుగా మరికొన్ని సినిమాలు చేసిన తర్వాత వెండితెరకు ఆమె దూరమయ్యారు. మళ్లీ ఒక్కసారిగా ‘బలగం’ సినిమాతో దూసుకొచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్గా కంటే కూడా ఒక నటిగా ఆమె తానేంటో నిరూపించుకున్నారు.
‘బలగం’ మూవీ మంచి పేరుతో పాటు కావ్యా కల్యాణ్‌రామ్‌కు అవార్డులను కూడా తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గానూ పలు అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ‘బలగం’లో పద్ధతిగా, హోమ్లీగా, పక్కింటి అమ్మాయిగా కనిపించారు కావ్య. కానీ సినీ పరిశ్రమలో నటన ఒక్కటే ఉంటే సరిపోదు. పద్ధతిగా కనిపించే పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ అవసరాన్ని గుర్తించారో ఏమో సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు కావ్య. పొట్టి దుస్తుల్లో హీట్ పెంచే ఫొటోలను పెడుతూ కుర్రకారు మనసులను దోచుకుంటున్నారు. ఈ ఫొటోలను చూస్తుంటే గ్లామర్ రోల్స్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లే ఉందని నెటిజన్స్ అంటున్నారు. కాగా, కావ్య నటించిన ‘ఉస్తాద్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.