ఆమె దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ హిట్స్ కొట్టిన ఈ బ్యూటీ.. హీరోయిన్ గా అంతకంటే లక్కీగా మారిపోయింది.
చాలామంది హీరోయిన్స్ హిట్స్ కొట్టడానికి తెగ కష్టపడుతుంటారు. స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతాం, స్టార్ హోదా వస్తుందని భ్రమ పడుతుంటారు. కానీ ఎంటర్ టైన్ చేయాలంటే అవేం అక్కర్లేదని ఈ హీరోయిన్ ప్రూవ్ చేసింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇలా అందరి హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది. ఇప్పుడు హీరోయిన్ కూడా అయిపోయింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
అసలు విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప టాలీవుడ్ లో ఎప్పటినుంచో నటిస్తోంది. ‘గంగోత్రి’లో వల్లంకి పిట్ట పాటలో ఉన్నది. ఠాగూర్, బాలు, బన్నీ తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేసింది ఈ పిల్లనే. ఈమె పేరు కావ్య కల్యాణ్ రామ్. ఖమ్మంలోని కొత్తగూడెం ఈమె పుట్టి పెరిగిన ఊరు. చైల్డ్ ఆర్టిస్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత లా(న్యాయవాది) కోర్స్ పూర్తి చేసింది. రీసెంట్ టైంలో మళ్లీ తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
‘మసూద’లో హీరోయిన్ గా ఫస్ట్ సినిమా చేసిన కావ్య.. ఫస్ట్ ఫస్టే అద్భుతమైన సక్సెస్ అందుకుంది. రీసెంట్ సెన్సేషన్ ‘బలగం’లోనూ ఈమెనే హీరోయిన్. ఇలా హీరోయిన్ గా చేసిన రెండు మూవీస్ తోనూ హిట్స్ కొట్టేసింది. దీంతో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తాజాగా ‘ఉస్తాద్’ అనే మరో మూవీలో హీరోయిన్ గా చేసింది. రిలీజైన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. దీంతో కావ్యకు మరో హిట్ గ్యారంటీ అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఎంట్రీతోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బ్యూటీగా ఘనత సాధిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. పవన్ తో ఉన్న ఈ పాపని చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.